వరద బాధితులకు ఆర్థిక సహాయం

ABN , First Publish Date - 2022-01-04T04:46:37+05:30 IST

మండలంలోని శాన్వి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్థులు, ఉపాధ్యాయులు సేకరించిన నగదును ఆ పాఠశాల కరస్పాండెంటు కొం డూరు శరత్‌కుమార్‌రాజు ఆధ్వర్యంలో వరద బాధితులకు అందజేశారు.

వరద బాధితులకు ఆర్థిక సహాయం
అయేషా కుటుంబానికి లక్ష రూపాయల నగదు అందజేస్తున్న కొండూరు శరత్‌కుమార్‌రాజు

రాజంపేట, జనవరి 3: మండలంలోని శాన్వి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్థులు, ఉపాధ్యాయులు సేకరించిన నగదును ఆ పాఠశాల కరస్పాండెంటు కొం డూరు శరత్‌కుమార్‌రాజు ఆధ్వర్యంలో వరద బాధితులకు అందజేశారు. భర్తను కోల్పోయిన అయేషాకు లక్ష రూపాయల నగదును, హస్తవరంలో దుకాణాన్ని కోల్పోయిన సిద్దల మరియమ్మకు 20వేల రూపాయల నగదును అందజేశారు. కార్యక్రమంలో సీఈవో శంకర్‌రాజు, ప్రిన్సిపల్‌ సోమశేఖర్‌, కొండూరు సుబ్బరామరాజులుపాల్గొన్నారు.  

Read more