కానిస్టేబుల్‌ కుటుంబానికి ఆర్థిక సాయం

ABN , First Publish Date - 2022-09-14T04:37:35+05:30 IST

ఇటీవల రోడ్డు ప్రమాదంలలో మృతి చెందిన ఆర్కే వ్యాలీ పీఎస్‌ కానిస్టేబుల్‌ జి.వెంకటశివ(పీసీ 2860) కుటుంబానికి మంగళవారం ఎస్పీ కేకేఎన అన్బురాజన రూ.2.75 లక్షల ఆ ర్థిక సాయం అందజేశారు.

కానిస్టేబుల్‌ కుటుంబానికి ఆర్థిక సాయం

కడప(క్రైం), సెప్టెంబరు 13 : ఇటీవల రోడ్డు ప్రమాదంలలో మృతి చెందిన ఆర్కే వ్యాలీ పీఎస్‌ కానిస్టేబుల్‌ జి.వెంకటశివ(పీసీ 2860) కుటుంబానికి మంగళవారం ఎస్పీ కేకేఎన అన్బురాజన రూ.2.75 లక్షల ఆ ర్థిక సాయం  అందజేశారు. ఇందులో పోలీసు వితరణ నిధి నుంచి రూ.2 లక్షలు, రూ.50 వేలు, విడో ఫండ్‌, వేలఫ్లాగ్‌ ఫండ్‌ నుంచి రూ.25 వేలు కలిపి ఆ మొత్తాన్ని చెక్కు రూపంలో అందించారు. కాగా లింగాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటశివ ఇటీవల మృతిచెందిన విషయం విదితమే. వెంకటశివ సతీమణి లక్ష్మీప్రసన్నకు ఎస్పీ అన్బురాజన జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆర్థిక సాయం అందజేశారు. జిల్లా పోలీస్‌ కార్యాలయ ఏఓ జ్యోతి,  పోలీసు అధికారుల సంఘం జిల్లా అద్యక్షుడు దూలం సురేష్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శంకర్‌ పాల్గొన్నారు. 

Read more