-
-
Home » Andhra Pradesh » Kadapa » Fight till justice is served-MRGS-AndhraPradesh
-
న్యాయం జరిగే వరకు పోరాటం
ABN , First Publish Date - 2022-09-08T05:30:00+05:30 IST
ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు ఇస్తున్న వేతనాలను తమకు కూడా కల్పించాలని కోరుతూ ఆర్జీయూకేటీ పరిధిలో పనిచేస్తున్న అధ్యాపకులు నిరసనను వ్యక్తం చేశారు.

ట్రిపుల్‌ఐటీ అధ్యాపకుల నిరసన
వేంపల్లె, సెప్టెంబరు 8: ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు ఇస్తున్న వేతనాలను తమకు కూడా కల్పించాలని కోరుతూ ఆర్జీయూకేటీ పరిధిలో పనిచేస్తున్న అధ్యాపకులు నిరసనను వ్యక్తం చేశారు. గురువారం ఆర్కేవ్యాలీ టట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో నాలుగోరోజు నిరనసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉందని, ఆర్జీయూకేటీ యాజ మాన్యం ఎందుకు తమపై కఠిన వైఖరి ప్రదర్శిస్తుందో అర్థం కావడం లేదని వాపోయారు. ఐదేళ్ల నుంచి దాదాపు 200 మంది కాంటట్రాక్టు అద్యాపకులు చాలీచాలని వేతనాలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పం దించి న్యాయం చేయాలని కోరారు.