రైతులకు విరివిగా పంట రుణాలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-01-21T04:53:07+05:30 IST

వ్యవసాయ రంగంలో సాగు ఖర్చులు గణనీయంగా పెరిగాయని ఈ నేపద్యంలో రైతులకు సాగు ఖర్చులకు అవసరమైన రుణాలను విరివిగా ఇవ్వాలని డీసీసీ బ్యాంక్‌ సీఈవో విజయభాస్కర్‌రెడ్డి తెలిపారు.

రైతులకు విరివిగా పంట రుణాలు ఇవ్వాలి
సమావేశంలో మాట్లాడుతున్న సీఈవో విజయభాస్కర్‌రెడ్డి

డీసీసీ బ్యాంక్‌ సీఈవో విజయభాస్కర్‌రెడ్డి

కడప రూరల్‌, జనవరి 20 : వ్యవసాయ రంగంలో సాగు ఖర్చులు గణనీయంగా పెరిగాయని ఈ నేపద్యంలో రైతులకు సాగు ఖర్చులకు అవసరమైన రుణాలను విరివిగా ఇవ్వాలని డీసీసీ బ్యాంక్‌ సీఈవో విజయభాస్కర్‌రెడ్డి తెలిపారు. నగరంలోని డీసీసీ బ్యాంక్‌ కార్యాలయంలో గురువారం రైతుల పంట రుణాల వార్షిక బడ్జెట్‌ రూపకల్పన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏయే పంటలకు  ఎంత మేరకు ఖర్చు అవుతుంది ఏ మేరకు బ్యాంక్‌ నుంచి లోన్‌ మంజూరు చేయవచ్చు అనే అంశాలపై జాబితాను తయారు చేసి ప్రభుత్వం ఆమోదం కోసం పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేరుశనగ, పత్తి, పసుపు, వరి, మిరప, మినుము, మొక్కజొన్న, ఉల్లి, అరటి, బొప్పాయి తదితర పంటలకు ప్రతి ఏడాది సాగు ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఏడాది రుణాలను ఇస్తున్నామన్నారు. కానీ గతంలో కంటే ప్రస్తుతం సాగు ఖర్చులు పెరిగాయన్నారు. ఈ మేరకు 2022-23లో ఆయా పంటలకు అందించే రుణాలను మరింతగా పెంచి  రైతులను అన్ని విదాలుగా ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో వివిధ బ్యాంకుల అధికారులు, వ్యవసాయ సంబంధిత అన్ని విభాగాల జిల్లా స్థాయి అధికారులు, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-21T04:53:07+05:30 IST