రైతుల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-08-11T04:41:32+05:30 IST

టమోటా రైతుల సమస్యలను పరిష్కరించలేని మార్కెట్‌ కమిటీ పాలకమండలి ఎందుకని సీపీ ఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు.

రైతుల సమస్యలు పరిష్కరించాలి
ధర్నా చేస్తున్న సీపీఎం, ఏపీ రైతుసంఘం నాయకులు

మదనపల్లె అర్బన్‌, ఆగస్టు 10: టమోటా రైతుల సమస్యలను పరిష్కరించలేని మార్కెట్‌ కమిటీ పాలకమండలి ఎందుకని సీపీ ఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. మదనపల్లె మార్కెట్‌ యార్డులో టమోటా రైతుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ రైతులసంఘం ఆధ్వర్యంలో ప్రద ర్శన, ఆందోళనలు చేపట్టారు. మార్కెట్‌ కమిటీ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. టమోటాకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతుల నుంచి ప్రభుత్వం టమోటాలు కొనుగోలు చేయాలని, జాక్‌పాట్‌ విధానాన్ని రద్దు చేయాలని, మార్కెట్‌ యార్డులో రైతులకు మౌలిక సదు పాయాలు కల్పించాలని, విశ్రాంతి భవనం కేటాయించాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఏడాది మొత్తం టమోటా ఉత్పత్తి చేస్తే ఏదో ఒక నెలమాత్రమే మంచి ధరలు పలుకు తున్నాయన్నారు. టమోటా పంటపై ఆధారపడి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  రెండు రోజుల్లో సమస్యలకు పరిష్కారం చూపకపోతే మార్కెట్‌ యార్డును ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం మండల అధ్యక్షుడు శ్యామ్‌సుందర్‌, కార్యదర్శి గణేష్‌రెడ్డి, నాయకులు ఈశ్వర నాయుడు, లక్ష్మీనారాయణ, రమణారెడ్డి, మల్లికార్జున, నరసింహులు, రామిరెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2022-08-11T04:41:32+05:30 IST