విద్యుదాఘాతంతో రైతు మృతి

ABN , First Publish Date - 2022-12-07T23:20:27+05:30 IST

పి.కొత్తపల్లె వాసి మీగ డ యానాదిరెడ్డి (75) బుధవారం విద్యుదాఘా తానికి గురై మృతి చెందినట్లు పెనగలూరు ఎస్‌ఐ హేమాద్రి తెలిపారు.

విద్యుదాఘాతంతో రైతు మృతి
యానాదిరెడ్డి మృతదేహం

పెనగలూరు, డిసెంబరు7: పి.కొత్తపల్లె వాసి మీగ డ యానాదిరెడ్డి (75) బుధవారం విద్యుదాఘా తానికి గురై మృతి చెందినట్లు పెనగలూరు ఎస్‌ఐ హేమాద్రి తెలిపారు. ఆయన తెలిపిన సమాచా రం మేరకు వివరాలిలా ఉన్నాయి. యానాదిరెడ్డి ఉదయం ఇంటి నుంచి బయలుదేరి పొలానికి వెళుతుండగా దారి పక్కనే గల బైరెడ్డి రాఘవరెడ్డి సపోట తోటకు వేసి ఉన్న ఇనపు ముళ్ల కంచెను తొక్కడంతో విద్యుత్‌ సరఫరా జరిగి మృతి చెంది నట్లు తెలుస్తోందన్నారు.

కంచె నేలకు తక్కువ ఎత్తులో ఉండడంతో యానా దిరెడ్డి అడుగు పెట్టడంతో షాక్‌కు గురై పడిపోయాడు. దెబ్బతిన్న సర్వీసు వైరు తోట చుట్టూ ఉన్న ముళ్ల కంచెకు తాకడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనపై మృతుని కుమారుడు మీగడ విశ్వనాధరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి

రైల్వేకోడూరు(రూరల్‌) డిసెంబర్‌ 7: వెంకయ్యస్వామి గుడి వద్ద బుధవారం రాత్రి ద్విచక్ర వాహనం ఢీకొనడంతో మల్లెల వెంకటసుబ్బమ్మ(59) అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసుల వివరాల మేరకు ఓబులవారిపల్లి మండలం వై.కో ట వాసి వెంకటసుబ్బమ్మ దినసరి కూలీ. పని ముగించుకుని వెళ్తుండగా మా ర్కెట్‌ నుంచి కోడూరుకు వస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఆమెను ఢీకొ నడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసినట్లు పోలీ సులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు

రామాపురం, డిసెంబరు7: గంగనేరు క్రాస్‌ రోడ్డు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్కూటరిస్టు బండపల్లి చిన్ననాగన్నకు తీవ్రగాయాలైనట్లు రామాపురం ఎస్‌ఐ కొండారెడ్డి తెలిపారు. పోలీసుల కథనం మేరకు వివరాల్లో కెళితే.... బండపల్లె పంచాయతీ కొత్తూరుపల్లె వాసులు బండపల్లి రెడ్డెయ్య, చిన్ననాగన్న రెడ్డెయ్య కుమార్తె వివాహ పత్రికలు ఇచ్చేందుకు టీవీఎస్‌ ఎక్సెల్‌ లో గంగనేరుకు వెళ్తుండగా గంగనేరు క్రాస్‌ రోడ్డు వద్ద వెను నుంచి వచ్చిన పోలీసు వాహనం ఢీకొనడంతో చిన్ననాగన్నకు తీవ్రగాయాలయ్యాయి. సంఘ టనా స్థలానికి రామాపురం పోలీసులు చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం 108లో రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ పరిస్థితి విషమించడంతో కడప రిమ్స్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

Updated Date - 2022-12-07T23:20:28+05:30 IST