న్యూఇయర్ వేడుకలకు సర్వం సిద్ధం
ABN , First Publish Date - 2022-12-31T23:08:45+05:30 IST
నూతన సంవత్సర వేడుకలను ఆనందోత్సా హాల మధ్య జరుపుకోవడానికి సర్వం సిద్ధమైంది. శనివారం సాయం త్రం నుంచే నూతన సంవత్సర వేడుకలకు పట్టణ ప్రజలు సంబరాల తో మునిగిపోవడంతో సందడి వాతావరణం నెలకొంది.
పీలేరు, డిసెంబరు 31: నూతన సంవత్సర వేడుకలను ఆనందోత్సా హాల మధ్య జరుపుకోవడానికి సర్వం సిద్ధమైంది. శనివారం సాయం త్రం నుంచే నూతన సంవత్సర వేడుకలకు పట్టణ ప్రజలు సంబరాల తో మునిగిపోవడంతో సందడి వాతావరణం నెలకొంది. నూతన సంవత్సరాది మరుసటి రోజే వైకుంఠ ఏకాదశి కూడా ఉండడంతో కోటపల్లెలోని పద్మావతి ఆండాళ్ సమేత వేంకటేశ్వర స్వామి, వేంక టాద్రి ఇళ్ల వద్ద వేంకటేశ్వర స్వామి ఆలయాలు ప్రత్యేక పూజల కోసం ముస్తాబయ్యాయి. అదే విధంగా పట్టణంలోని చర్చిలను కూడా వాటి నిర్వాహకులు సుందరంగా అలంకరించారు. శనివారం అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నూతన ఏడాది స్వాగత సంబరాలంటూ స్కూటర్ ర్యాలీలు నిర్వహించరాదని పీలేరు అర్బన సీఐ మోహన రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు.
తంబళ్లపల్లెలో: నూతన సంవత్సర, వైకుంఠ ఏకాదశి వేడుకలను పురస్కరించుకొని ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలువంటి అసౌ కర్యం కలుగకుండా ఆలయ నిర్వాహకులు, అధికారులు అన్ని ఏర్పా ట్లు చేపట్టారు. కోసువారిపల్లె ప్రసన్న వెంటక రమణ స్వామి ఆల యంలో 1న ఉదయం 5 గంటల నుంచి దర్శనానికి భక్తులను అను మతించనున్నట్లు ఆలయ ఇనస్పెక్టర్ రెడ్డిభాస్కర్ తెలిపారు. అలాగే, వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని 2వ తేదీ ఉదయం 5 గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపారు.
పెద్దతిప్పసముద్రంలో : మండల కేంద్రమైన పీటీఎంలో వెలసిన ప్రసన్న పార్వతీ సమేత విరూపాక్షేశ్వర స్వామి ఆలయంలో సోమవా రం ముక్కోటి ఏకాదశి సందర్భంగా విశేష పూజలను నిర్వహిస్తున్న ట్లు పీటీఎంకు చెందిన ఆధ్యాత్మిక వేత్త సనగరం పట్టాభిరామయ్య తెలిపారు. ఉదయం 5గంటల నుంచి ఉత్తరద్వారంలో స్వామి వారి దర్శనాన్ని కల్పించనున్నట్లు తెలిపారు.
గుర్రంకొండలో:నూతన సంవత్సర వేడుకలకు మండలంలోని పలు ఆలయాలు ప్రత్యేకంగా ముస్తాబవుతున్నాయి. ఇందులో భాగంగా తరిగొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, చెర్లోపల్లె రెడ్డెమ్మకొండ ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు.
మండల్ కమిషన సిఫార్సులను అమలు చేయాలి
పీలేరు, డిసెంబరు 31: బీసీ మండల్ కమిషన సిఫార్సులను అమ లు చేయా లని బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆమేరకు శనివారం పీలేరులో రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం, ప్రజా సంఘాల నాయకులు ర్యా లీ నిర్వ హించారు. ఈ సందర్భంగా బీసీ ఉద్యో గుల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ రాయల బాబురాజేంద్రప్రసాద్ మాటాడారు. అనంతరం తహసీల్దారు రవికి వారొక వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఐక్య ప్రజాసంఘాల రాష్ట్ర కార్యదర్శి నారాయణ, ఉపాధ్యక్షులు దామోదరం, వెంకటరమణ, మహేశ, పురుషోత్తం, మురళీ, జనార్దన, చంద్ర, విశ్వకాంత, భాను పాల్గొన్నారు.