సర్పంచ్‌ల సంఘం కార్యాలయం ఏర్పాటు శుభపరిణామం: డీపీఓ

ABN , First Publish Date - 2022-02-20T04:47:18+05:30 IST

సర్పంచ్‌లు తమ సమస్యలు పరిష్కారం కోసం కార్యాలయం ఏర్పాటు చేయడం శుభపరిణామమని డీపీఓ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

సర్పంచ్‌ల సంఘం కార్యాలయం ఏర్పాటు శుభపరిణామం: డీపీఓ

కడప రూరల్‌, ఫిబ్రవరి 19 : సర్పంచ్‌లు తమ సమస్యలు పరిష్కారం కోసం కార్యాలయం ఏర్పాటు చేయడం శుభపరిణామమని డీపీఓ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. కడప నగరం క్రిష్టియన్‌ లైన్‌లోని డీఎల్‌పివో కార్యాలయంలోని రెండవ అంతస్తులో నూతనంగా ఏర్పాటుచేసిన సర్పంచ్‌ల సంఘం జిల్లా కార్యాలయ ప్రారంభానికి శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సర్పంచ్‌లు ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు. సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని సర్పంచ్‌ల సమస్యలను పరిష్కరించడానికి కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. వారానికి రెండు సార్లు సమావేశం నిర్వహించి తద్వారా సర్పంచ్‌ల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామన్నారు. 

Read more