ఆక్రమణలు తొలగించాలి

ABN , First Publish Date - 2022-07-06T05:07:53+05:30 IST

నిక బస్టాండు సమీపంలో ఆక్రమణలను వెంటనే తొలగించాలని మాజీ సర్పంచ్‌ మల్లప్ప పేర్కొన్నారు.

ఆక్రమణలు తొలగించాలి

నిమ్మనపల్లె, జూలై 5: స్థానిక బస్టాండు సమీపంలో ఆక్రమణలను వెంటనే తొలగించాలని మాజీ సర్పంచ్‌ మల్లప్ప పేర్కొన్నారు. మంగళవారం ఆక్రమణలకు సంబందించి తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్టాండులో  రోడ్డు  సర్వే ప్రకారం వేయకపోవడంతో కొందరు వ్యాపారులు రోడ్డపైనే తోపుడుబండ్లు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారన్నారు. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బస్టాండు సమీపం నుంచి చావిడి వరకు వున్న రోడ్డు పూర్తిగా ఆక్రమణలకు గురైందని తెలిపారు. దీంతో ప్రయాణికులకు మరుగుదొడ్లు నిర్మిచేం దుకు కూడా స్థలం లేదన్నారు.  దీంతో అక్కడకు చేరుకొన్న తహసీల్దార్‌ మంజుల  రెండు రోజుల్లోగా సర్వే పూర్తి చేసి వివరాలను సమర్పించాలని అధికారులను ఆదే శించారు. బస్తాండులో ఆక్రమణలపై విచారణ జరుగు తుం దని తెలవడంతో పెద్ద ఎత్తున ప్రజలు చేరుకొన్నారు. దీంతో ఎస్‌ఐ ఫాతీమా అక్కడకు చేరుకొని ఎలాంటి గొడవ జరగ కుండా అదుపు చేశారు. ఆక్రమణలు తొలగించకుంటే కలెక్టర్‌ దృష్టికి తీసుకెళతామని రాజన్న, చెండ్రాయుడు, శ్రీరాములు, రమణ, తదితరులు తెలిపారు.

Read more