అధికారమిచ్చి తప్పు చేశాం

ABN , First Publish Date - 2022-01-20T05:21:01+05:30 IST

అధికారంలోకి వస్తే ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమానికి పాటుపడతానని ఇచ్చిన హామీలను నమ్మి ముఖ్యమంత్రిగా జగనమోహనరెడ్డికి అధికారమిచ్చి తప్పు చేశామని యూటీఎఫ్‌ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రివర్స్‌ పీఆర్సీతో తమకు అన్యాయం చేసిందంటూ వినూత్నంగా నిరసన తెలిపారు.

అధికారమిచ్చి తప్పు చేశాం
సింహాద్రిపురంలో పీఆర్సీ ప్రతులను దహనం చేస్తున్న ఉపాధ్యాయులు

రివర్స్‌ పీఆర్సీతో అన్యాయం చేశారు

గోడకుర్చీతో ఉపాధ్యాయుల నిరసన

బద్వేలు, జనవరి 19: అధికారంలోకి వస్తే ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమానికి పాటుపడతానని ఇచ్చిన హామీలను నమ్మి ముఖ్యమంత్రిగా జగనమోహనరెడ్డికి అధికారమిచ్చి తప్పు చేశామని యూటీఎఫ్‌ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రివర్స్‌ పీఆర్సీతో తమకు అన్యాయం చేసిందంటూ వినూత్నంగా నిరసన తెలిపారు. టీఎనఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు మాదన విజయ్‌కుమార్‌, యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో చెన్నకేశంపల్లె ఉన్నత పాఠశాలలో రీవర్స్‌ పీఆర్సీని నిరసిస్తూ జగనమోహనరెడ్డికి అధికారమిచ్చి తప్పు చేసినందుకు పశ్చాత్తాపంగా లెంపలు వేసుకుంటూ గోడకుర్చీ వేసి ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విజయ కుమార్‌ మాట్లాడుతూ ఉద్యోగుల అండదండలతో అధికారంలోకి వచ్చిన జగనమోహనరెడ్డి ఉద్యోగులపై కక్ష సాధింపు ధోరణికి పాల్పడుతున్నారన్నారు. 2018 జూలై నుంచి అమలు చేయాల్సిన పే రివిజన రెండున్నరేళ్లగా కాలయాపన చేసి ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ 23శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించడం దారుణమన్నారు. నమ్మిన వారిని సులభంగా మోసం చేయవచ్చనే సహజసూత్రాన్ని పాటించారన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుల సంఘం నేతలు కేవీ రమణయ్య, కె.గంగయ్య, సుబ్బారావు, పెంచలయ్య, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


సింహాద్రిపురంలో పీఆర్సీ ప్రతుల దహనం

సింహాద్రిపురం, జనవరి 19: రివర్స్‌ పీఆర్సీ అమలు చేస్తున్నారంటూ సింహాద్రిపురం మండల ఉపాధ్యా యులు ధ్వజమెత్తారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన అసంబద్ధ పీఆర్సీ ఫిట్‌మెంట్‌, హెచఆర్‌ఏ జీఓలకు వ్యతిరేకంగా సింహాద్రిపురం మండల వనరుల విద్యాకేంద్రంలో బుధవారం పీఆర్సీ జీఓ ప్రతులను దహనం చేశారు. ముఖ్యమంత్రి జగనమెూహనరెడ్డి వెంటనే జోక్యం చేసుకుని జీఓల్లో సవరణ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


నేడు కలెక్టరేట్‌ ముట్టడి

చెన్నూరు, జనవరి 19: పీర్సీని వ్యతిరేకిస్తూ గురువారం జరిగే కలెక్టరేట్‌ ముట్టడిని ఉపాధ్యా యులు జయప్రదం చేయాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజా పిలుపునిచ్చారు. బుధవారం చెన్నూరు మండలంలోని ఉప్పరపల్లెలో రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు ఉపాధ్యాయులకు కలెక్టరేట్‌ ముట్టడి కరపత్రాలు అందజేశారు. అలాగే రామనపల్లెలో ఆంధ్రప్రదేశ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి పీఆర్సీ జీవోలను వ్యతి రేకిస్తూ వాటి ప్రతులను దహనం చేశారు.




Updated Date - 2022-01-20T05:21:01+05:30 IST