డ్రోన్‌ పైలట్‌తో ఉపాధి అవకాశాలు

ABN , First Publish Date - 2022-01-24T04:30:57+05:30 IST

డ్రోన్‌ పైలట్‌ విభాగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని, నిరుద్యోగ యువత కొత్త అవకాశాలను అందిపుచ్చుకొని స్వయం అభివృద్ధి చెందాలని ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌.బి.అంజాద్‌బాషా తెలిపారు.

డ్రోన్‌ పైలట్‌తో ఉపాధి అవకాశాలు
డ్రోన్‌ను పరిశీలిస్తున్న అంజద్‌బాషా, తదితరులు

ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా

కడప (ఎడ్యుకేషన్‌), జనవరి 23 : డ్రోన్‌ పైలట్‌ విభాగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని, నిరుద్యోగ యువత కొత్త అవకాశాలను అందిపుచ్చుకొని స్వయం అభివృద్ధి చెందాలని ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌.బి.అంజాద్‌బాషా తెలిపారు. కడప మున్సిపల్‌ ఉర్దూ స్కూల్‌లో ఆదివారం మైనార్టీ సంక్షేమ శాఖ, సీఈడీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రోన్‌ పైలట్‌ ఉచిత శిక్షణా తరగతుల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక యుగంలో డ్రోన్‌ల వినియోగం శరవేగంగా విస్తరిస్తోందన్నారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన మైనార్టీ నిరుద్యోగ యువతకు పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద మన జిల్లాలో మొదటిసారిగా డ్రోన్‌ పైలట్‌ ఉచిత శిక్షణా తరగతులను డ్రోన్‌ ఇనిస్టిట్యూట్‌ టెక్నాలజీ నేతృత్వంలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. మైనార్టీ నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్‌ పైలట్‌ కోర్సులను 45 రోజుల్లో ఉచితంగా నేర్పించి సర్టిఫికెట్‌తో పాటు ఉద్యోగావకాశాలు కల్పిస్తోందన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు సూర్యనారాయణ, షఫీ, వైసీపీ నాయకులు సుభాన్‌బాషా, డ్రోన్‌ ఇనిస్టిట్యూట్‌ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ తాహీర్‌షేక్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-24T04:30:57+05:30 IST