పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయాలి
ABN , First Publish Date - 2022-12-15T23:34:10+05:30 IST
పాడిపరిశ్రమ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్‌చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి సూచించారు. మండలంలోని గోపవరం సమీపంలో ఉన్న శ్రీవెంకటేశ్వర పశువైద్య కళాశాలను గురువారం ఆయన సందర్శించారు. తొలుత పశువైద్య చికిత్స
రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్‌చైర్మన్
ప్రొద్దుటూరు రూరల్, డిసెంబరు 15 : పాడిపరిశ్రమ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్‌చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి సూచించారు. మండలంలోని గోపవరం సమీపంలో ఉన్న శ్రీవెంకటేశ్వర పశువైద్య కళాశాలను గురువారం ఆయన సందర్శించారు. తొలుత పశువైద్య చికిత్స సముదాయంలో ఉన్న శస్త్రచికిత్స, సాధారణ వ్యాధులు, గర్భకోశ వ్యాధులకు సంబంధించిన విభాగాల్లో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. పశుక్షేత్ర సముదాయంలోని ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, పందులు, కోళ్ల జాతులను సందర్శించారు. వివిధ విభాగాల్లో ఉన్న సౌకర్యాలు, ప్రయోగశాలలు, ప్రదర్శనలను తరగతి గదులను పరిశీలించారు. ఉన్న వసతులపై, నూతన సదుపాయాల గురించి అధ్యాపకులతో, విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్‌చార్జి అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీలత, డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, అగ్రిమిషన్ ఎగ్జిక్యూటివ్ మెంబరు ఎస్.శివప్రసాద్‌రెడ్డి, జిల్లా అగ్రి అడ్వయిజరీ బోర్డు ఛైర్మన్ శివప్రసాద్‌రెడ్డి, ఏడీ డాక్టర్ వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.