గాండ్ల కులస్థుల రాజకీయ అభివృద్ధికి కృషి చేయాలి
ABN , First Publish Date - 2022-12-26T00:12:55+05:30 IST
గాండ్ల కులస్థులను రాజకీయాభివృద్ది చెందేలా కృషి చేయాలని పోతబోలు సర్పంచ ఈశ్వరయ్య పేర్కొన్నారు.
మదనపల్లె, అర్బన, డిసెంబరు 25: గాండ్ల కులస్థులను రాజకీయాభివృద్ది చెందేలా కృషి చేయాలని పోతబోలు సర్పంచ ఈశ్వరయ్య పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని పోత బోలు గ్రామం, భూమకవారిపల్లె వద్ద చెన్నకే శవస్వామి ఆలయంలో వనభోజనమహోత్సవం నిర్వహించారు. గాండ్ల కులస్థులు అందరు అక్క డికి చేరుకొని వనభోజనాలు చేశారు. అనంతరం కులభాందవులు ఐక్యంగా మెలిగి ఆర్ధిక, సామాజిక, రాజకీయాల్లో అభివృద్ది చెందాలని చర్చించుకున్నారు. అంతకముందే చెన్నకేశవస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బగ్గిడిగోపాల్, ప్రకాశంపతులు, రాము, సిహెచక్రిష్ణ, అక్కులప్ప, వై. కొండయ్య జగన్మోహన తదితరులు పాల్గొన్నారు.