బాల్‌బ్యాడ్మింటన్‌ ఛాంపియన్లుగా తూర్పుగోదావరి

ABN , First Publish Date - 2022-12-30T22:55:10+05:30 IST

ఎస్జీఎఫ్‌ అండర్‌-14 బాలబాలికల రాష్ట్రస్థాయి బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీల్లో తూర్పుగోదావరి జిల్లా బాలబాలికలు చాంపియన్లుగా నిలిచారు. శుక్రవారం పూజ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో 66వ ఎస్జీఎఫ్‌ రాష్ట్రస్థాయి బాల్‌బాడ్మింటన్‌ పోటీలు నిర్వహించారు.

బాల్‌బ్యాడ్మింటన్‌ ఛాంపియన్లుగా తూర్పుగోదావరి
ప్రథమ స్థానంలో నిలిచిన తూర్పు గోదావరి క్రీడాకారులు

ప్రొద్దుటూరు టౌన్‌, డిసెంబరు 30: ఎస్జీఎఫ్‌ అండర్‌-14 బాలబాలికల రాష్ట్రస్థాయి బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీల్లో తూర్పుగోదావరి జిల్లా బాలబాలికలు చాంపియన్లుగా నిలిచారు. శుక్రవారం పూజ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో 66వ ఎస్జీఎఫ్‌ రాష్ట్రస్థాయి బాల్‌బాడ్మింటన్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో బాలుర, బాలికల విభాగంలో తూర్పుగోదావరి జట్లు ఉత్తమ ప్రతిభకనబరిచి మొదటి స్థానంలో నిలిచాయి. బాలుర విభాగంలో తూర్పుగోదావరి, శ్రీకాకుళం జట్టంపై విజయం సాధించగా, శ్రీకాకుళం జట్టు ద్వితీయస్థానంలో, కర్నూ లు జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. బాలికల విభాగంలో తూర్పు గోదావరి జట్టు, విశాఖపట్నం జట్టుపై విజయం సాధించగా, విశాఖపట్నం ద్వితీయస్థానం, గుంటూరు తృతీయ స్థానంలో నిలిచింది. విజేతలకు డీఈఓ దేవరాజు ట్రోఫిని అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటారు. ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి జిలానీబాషా మాట్లాడుతూ బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీల్లో జాతీయ స్థాయిలో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు ఉందని, యువ క్రీడాకారులు జాతీయ పోటీల్లో ప్రతిభకనబరచాలన్నారు. కార్యక్రమంలో పూజా స్కూల్‌ చైర్మన్‌ రాజారెడ్డి, మైలవరం ఎంపీపీ భాస్కర్‌రెడ్డి, టోర్నమెంట్‌ అబ్జర్వర్‌ విశ్వనాథ్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ సుధాకర్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, రమేష్‌, అంకాల్‌రెడ్డి, చంద్రకళ, శివశంకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T22:55:10+05:30 IST

Read more