-
-
Home » Andhra Pradesh » Kadapa » Duties are as per job chart-NGTS-AndhraPradesh
-
జాబ్ చార్ట్ ప్రకారమే విధులు
ABN , First Publish Date - 2022-09-19T05:49:10+05:30 IST
జాబ్ చార్ట్ ప్రకారమే తమ విధులకు సంబంధించిన సేవలను పొందాలని కడప, అన్నమయ్య జిల్లాల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండు చేసింది.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం
కలికిరి, సెప్టెంబరు 18: జాబ్ చార్ట్ ప్రకారమే తమ విధులకు సంబంధించిన సేవలను పొందాలని కడప, అన్నమయ్య జిల్లాల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండు చేసింది. ఆదివారం తిరుపతిలో జరిగిన తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లా సంఘాల కార్యవర్గ ఎన్నికల అనంతరం నాలుగు ఉమ్మడి జిల్లాల నేతలు సచివాలయ ఉద్యోగుల డిమాండ్లను ప్రకటించారు. అన్ని అర్హతలతో ఎంపికై రెండేళ్లకు పైబడి ఉద్యోగాలు చేస్తున్న మిగిలిన రెండు వేల మందికి ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని కోరారు. సచివాలయ ఉద్యోగులకు వారి మాతృ శాఖల నుంచి జీతాలు చెల్లించాలని డిమాండు చేశారు. మరణించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలోని అర్హులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. ఇతర ఉద్యోగుల మాదిరిగానే బదిలీలు చేపట్టాలన్నారు.
కడప, అన్నమయ్య జిల్లాల కార్యవర్గ ఎన్నికలు
ఏపీ జేఏసీ అమరావతికి సంబంధించి తిరుపతి, చిత్తూరు చైర్మన్‌లు శివప్రసాద్, అమరనాథ్‌ల ఆధ్వర్యంలో తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య అనుబంధ జిల్లా కార్యవర్గాలకు ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. ఏపీజీడబ్ల్యుఎ్‌సఈడబ్ల్యుఓ రాష్ట్ర అడ్‌హక్ అధ్యక్షుడు ఎ.సాయినాథరెడ్డి ఎన్నికలను పర్యవేక్షించారు. కడప జిల్లాకు సంబంధించి సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా శ్రీకాంత్‌రెడ్డి (ఎర్రగుంట్ల), ఉపాధ్యక్షుడిగా పరబ్రహ్మరావు (ప్రొద్దుటూరు), కార్యదర్శిగా అనురాగ్ (కడప), సంయుక్త కార్యదర్శిగా జయప్రకాష్ (వేముల), కోశాధికారిగా సునీల్ (చెన్నూరు) ఎన్నికయ్యారు. అన్నమయ్య జిల్లాకు సంబంధించి అఽధ్యక్షుడిగా యువకిశోర్ (కలికిరి), ఉపాధ్యక్షుడిగా హేమంత్ నాయక్ (పీలేరు), కార్యదర్శిగా ధనుంజయరెడ్డి (రాయచోటి), సంయుక్త కార్యదర్శిగా ఫకృల్లాఖాన్ (కురబలకోట), కోశాధికారిగా బి.నరే్‌షకుమార్ (కలికిరి) ఎన్నికయ్యారు.