బకాయిలను వెంటనే చెల్లించాలి: ఎస్టీయూ

ABN , First Publish Date - 2022-12-07T23:22:29+05:30 IST

బకాయిలను వెంటనే చెల్లించాలని ఎస్టీయూ ఆధ్వర్యంలో బుధవారం క లెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చే శారు.

బకాయిలను వెంటనే చెల్లించాలి: ఎస్టీయూ
వినతిపత్రం అందజేస్తున్న ఎస్టీయూ నేతలు

రాయచోటి(కలెక్టరేట్‌), డిసెంబరు 7: బకాయిలను వెంటనే చెల్లించాలని ఎస్టీయూ ఆధ్వర్యంలో బుధవారం క లెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చే శారు. సీపీఎస్‌ రద్దు చేస్తామన్న హా మీని మూడేళ్లు గడిచినా ఇంత వరకు అమలు చేయకపోవడం బాధాకరమ న్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏలు, పీ ఆర్‌సీ బకాయిలు, పీఎఫ్‌ లోన్లు తది తర విషయాల్లో ప్రభుత్వం ఇప్పటి వరకు రెండు వేల కోట్లకుపైగా విడుదల చేయాల్సి ఉందన్నారు. ఉపాధ్యాయ బదిలీలు, ప్రమోషన్లు పేపర్లకే పరిమితం అవుతున్నాయని, ఇప్పటికైనా ఉపాధ్యాయుల పదోన్నతులపై ఉత్తర్వులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. డీఎస్సీ 2003 ఉపా ధ్యాయులకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని కోరారు. అనంతరం కలెక్టర్‌ పీఎస్‌ గిరీషాను కలిసి వినతిపత్రం సమ ర్పించారు.

Updated Date - 2022-12-07T23:22:33+05:30 IST