డ్రైనేజీ వేశారు.. రోడ్డు పనులు మరిచారు
ABN , First Publish Date - 2022-01-18T05:04:24+05:30 IST
పులివెందులలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు పలు ప్రాంతాలలో ఏర్పాటుచేశారు.

పులివెందుల రూరల్, జనవరి 17: పులివెందులలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు పలు ప్రాంతాలలో ఏర్పాటుచేశారు. అయితే వాటి కోసం తవ్విన రోడ్డు పనులు మరిచిపోవ డంతో ప్రజలు ఇబ్బందులు పడుతు న్నారు. పట్టణంలోని యర్రగుడిపల్లె, వెంకటాపురం రోడ్డు తదితర ప్రాంతాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నిర్వహించారు. పనుల కోసం కోసం సీసీ రోడ్లను కట్ చేసి గుంతలు తీయడంతోపాటు పైపులు ఏర్పాటుచేశారు. దీనిపై మ్యాన్‌హోల్లు నిర్మించి ఆపై మట్టిని వేసి పూడ్చివేశారు. ఈ పనులు సకాలంలో జరిగినప్పటికి కట్ చేసిన రోడ్డును మళ్లీ ఏర్పాటుచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆవైపు ఆటోలు, ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలు, జీపులు, కార్లు నడపాలంటే వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు పూరై్ౖత దాదాపు మూడు నెలలు కావస్తున్నా రోడ్డు ఏర్పాటుచేకపోవడంతో చోదకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్, డీజల్ ధరల కారణంగా వాహనాలను బయటకు తీయాలంటే భయపడుతున్న వాహనదారులు ఈ గుంతల రోడ్లపై వెళితే ఉన్న కాస్త పెట్రోల్ కూడా అయిపోతుందని పలువురు వాపోతున్నారు. మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దాలన్న ఆశయంతో ఉన్న అధికారులు త్వరితగతిన ఈ పనులు పూర్తిచేయాలని ఆయా ప్రాం తాల ప్రజలు కోరుతున్నారు.