దళితుల ఆశాజ్యోతి డాక్టర్‌ అంబేడ్కర్‌

ABN , First Publish Date - 2022-12-06T23:49:02+05:30 IST

దళితుల ఆశాజ్యోతి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అని పలువురు పేర్కొన్నారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ బంగ్లా వద్ద ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి మాలమహానాడు, ఏపీఎంఆర్‌పిఎస్‌ ఆధ్వర్యంలో పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు.

దళితుల ఆశాజ్యోతి డాక్టర్‌ అంబేడ్కర్‌
పెనగలూరులో అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న దృశ్యం

రాజంపేట, డిసెంబరు 6: దళితుల ఆశాజ్యోతి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అని పలువురు పేర్కొన్నారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ బంగ్లా వద్ద ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి మాలమహానాడు, ఏపీఎంఆర్‌పిఎస్‌ ఆధ్వర్యంలో పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేడ్కర్‌ ప్రపంచంలోనే పీడిత ప్రజల హక్కుల కోసం ఉద్యమించిన పోరాట యోధుడు అన్నారు. కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు లింగం సంజీవ్‌, డివిజన్‌ విజిలెన్స్‌ ఎస్సీ, ఎస్టీల మానిటరింగ్‌ కమిటీ మెంబర్‌ పెనుబాల నాగసుబ్బయ్య, దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాధ్‌, దళితుల ఐక్యవేదిక కళాకారుల రాష్ట్ర అధ్యక్షుడు చంద్రమోహన్‌, ఏపీఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర నాయకుడు మురళీ, ఉమ్మడి జిల్లాల ప్రధాన కార్యదర్శి పెంచలయ్య పాల్గొన్నారు.

రాయచోటిటౌన్‌లో: దళిత బలహీన వర్గాల వికాసానికి పాలుపడిన మహానేత భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్థంతి వేడుకలను మంగళవారం ఎంఆర్‌పీఎస్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాయచోటి పట్టణంలోని ఎంఆర్‌పీఎస్‌ కార్యాలయంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్‌ రాయచోటి నియోజకవర్గ అద్యక్షులు బండకింద మనోహర్‌, ఎంఆర్‌పీఎస్‌ నేతలు ఆంజనేయులు, ఆనంద్‌, హరిబాబు, కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

రైల్వేకోడూరులో: పట్టణంలో అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మంగళవారం రైల్వేకోడూరులో మాలమహానాడు, ఏఐఎ్‌సఎఫ్‌, టీడీపీ, కాంగ్రెస్‌, సీపీఐ, సీఐటీయూ, బీజేపీ, వైసీపీ తదితర పార్టీలకు చెందిన నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థలు తదితరులు ఘనంగా పూలమాలలు వేసి నివాళి అర్పించా రు. కార్యక్రమంలో సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, సామాజిక సేవా కార్యకర్తలు పాల్గొన్నారు.

నందలూరులో: దళిత, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అని, సమత సైనిక్‌దళ్‌ కమిటీ మండల అధ్యక్షుడు చల్లా సురేంద్ర కొనియాడారు. అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా కమిటీ ఆధ్వర్యంలో అరవపల్లెలోని నందలూరు జడ్పీ క్రీడా మైదాన ప్రాంగణంలో ఉన్న మండల ప్రాథమిక పాఠశాల ఆవరణంలో మంగళవారం అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నందలూరు గ్రామ టీడీపీ నాయకుడు రాము, సీపీఐ జిల్లా నాయకులు పి.మహేష్‌, దేవర, సీనియర్‌ క్రికెట్‌ క్రీడాకారుడు పల్లె గ్రీష్మంత్‌రెడ్డి, సమత సైనిక్‌దళ్‌ మండల ఉపాధ్యక్షుడు గోదా జంపయ్య, కోశాధికారి కిరణ్‌, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

పెనగలూరులో: భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ వర్ధంతి కార్యక్రమాలను మంగళవారం పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో మాల మహానాయకులు జయరామయ్య, రామక్రిష్ణయ్య, శంకరయ్య, పి.శివశంకర్‌, సమతా సేవాదళ్‌ జిల్లా అధ్యక్షుడు సుబ్బనరసయ్య, సీపీఐ మండల కార్యదర్శి ఆదినారాయణ, సహాయ కార్యదర్శి లక్ష్మీనారాయణ, విజయభాస్కర్‌, నారాయణ, గోపాల్‌, కోనయ్య, ఎంఆర్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు పి.జయరాం, మండల అధ్యక్షుడు కుంచం శ్రీనివాసులు, ఎంఎ్‌సపీ అధ్యక్షుడు శ్రీనివాసులు, పల్లాల వెంకటేష్‌ (బద్రి), పి.రమణయ్య, పి.కృష్ణయ్య తదితరులు గజమాలలు వేసి ఘనంగా జేజేలు పలికారు.

సుండుపల్లెలో: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అని ఆయన వర్థంతి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు ఎంఆర్‌పీఎస్‌ నూతన మండల అధ్యక్షుడు మహదేవమాదిగ, ప్రజా సంఘాల నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మమహాజన సోషలిస్ట్‌ పార్టీ నాయకులు నాగేంద్ర, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు విశ్వనాధనాయక్‌, పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి రవిశంకర్‌ పాల్గొన్నారు.

చిట్వేలిలో: అంబేడ్కర్‌ వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఎంఆర్‌పీఎస్‌ మండల కన్వీనర్‌ మందా నాగేశ్వరరావు దళిత నాయకులతో కలిసి స్థానిక అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే మానవత స్వచ్ఛంద సంస్థ చిట్వేలి శాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు.

లక్కిరెడ్డిపల్లెలో: రాజ్యాంగ రూపకర్త డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అని జైభీమ్‌ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెంచర్ల ఆంజనేయులు పేర్కొన్నారు. అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ దేశ పురోగతి కోసం రాజ్యాంగ నిర్మాతగా నిలిచి దళితులకు న్యాయం చేసిన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ చెండ్రాయుడు, రామచంద్రయ్య, ముస్లిం మైనార్టీ సోదరులు, దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు.

చిన్నమండెంలో: అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి మండల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళితహక్కుల పోరాట సమితి మండల అధ్యక్షుడు పండరయ్య, కార్యదర్శి రెడ్డి సుధాకర్‌లు మాట్లాడారు. కార్యక్రమంలో డీహెచ్‌పీఎ్‌స నాయకులు వెంకట్రమణ, రెడ్డిప్రసాద్‌, సంజీవయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T23:49:03+05:30 IST