మా బతుకులతో ఆటలొద్దు
ABN , First Publish Date - 2022-08-05T04:45:41+05:30 IST
అసలే చాలీచాలని నెలవారీ వేతనాలతో కు టుంబాలను పో షించుకోలేని దుస్థితిలో కాలం వెల్లదీస్తున్న త మ బతుకులతో ఆటలొద్దని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ బిజినెస్ కరస్పాండెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీజీబీ బిజినెస్ కరాస్పాండెంట్ల ఆవేదన ఫ కడపలో నిరసన
కడప (మారుతీనగర్), ఆగస్టు 4: అసలే చాలీచాలని నెలవారీ వేతనాలతో కు టుంబాలను పో షించుకోలేని దుస్థితిలో కాలం వెల్లదీస్తున్న త మ బతుకులతో ఆటలొద్దని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ బిజినెస్ కరస్పాండెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అరకొర వేతనాలను సగానికి తగ్గించ డం దారుణమన్నారు. గురువారం వైఎస్సార్ కడప, అన్నమయ్య, సత్యసాయి, అనంతపు రం, కర్నూలు, ఒంగోలు, నంద్యాల, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి పలువురు కరస్పాండెంట్లు కడప ఏపీజీబీ రీజనల్ కార్యాలయం ఎదుట నిరసన తెలపాలనుకున్నారు.
పోలీసులు అంగీకరించక పోవడంతో పక్కనే ఉన్న మరియాపురం చర్చి ఆవరణలో అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. 2011 నుంచి బ్యాంకులో బిజినెస్ కరస్పాండెంట్లుగా పనిచేస్తున్నామన్నారు. అప్పట్లో నెలకు రూ.5,100, కమీషన్ కూడా ఇచ్చేవారన్నారు. ప్రస్తుతం రూ.2,250 వేతనం ఫిక్స్‌డ్ చేయడం దారుణమన్నారు. రూ. 2,250తో తమ కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి దాపురించిందన్నారు.
బ్యాంకు ఉన్నతాధికారులు, కంపెనీవారు గానీ తమ గోడును పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కరో నా సమయంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని మరీ సేవలందించామన్నారు. ఇప్పటికైనా మానవత్వంతో తమ సమస్యలను పరిష్కరించి కక్ష సాధింపు ధోరణి విడనాడాలన్నారు. నిరసన అనంతరం ఏపీజీబీ జీఎంను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బిజినెస్ కరస్పాండెండ్లు నబీరసూల్, జనార్ధన్, చెన్నారెడ్డి, శివలింగారెడ్డి, అయ్యవార్‌రెడిడ్డి పాల్గొన్నారు.