-
-
Home » Andhra Pradesh » Kadapa » Dont get fooled by the loan app SP-MRGS-AndhraPradesh
-
లోన్ యాప్ మాయలో పడవద్దు : ఎస్పీ
ABN , First Publish Date - 2022-09-08T05:30:00+05:30 IST
లోన్‌యా్‌పలు చాలా ప్రమాదకరమ ని, ప్రజలు ఇన్‌స్టెంట్, ఆన్‌లైన్ లింకుల ద్వారా రుణాలను తీసుకోవద్దని ఎస్పీ అన్బురాజన్ హెచ్చరించారు.

కడప(క్రైం), సెప్టెంబరు 8: లోన్‌యా్‌పలు చాలా ప్రమాదకరమ ని, ప్రజలు ఇన్‌స్టెంట్, ఆన్‌లైన్ లింకుల ద్వారా రుణాలను తీసుకోవద్దని ఎస్పీ అన్బురాజన్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆన్‌లైన్ ఇన్‌స్టెంట్‌లోన్ యాప్స్ బారినపడితే.. మీతో పాటు మీ స్నేహితులు, బంధువులను చిక్కుల్లో పడేసిన వారవుతారని ఎస్పీ తెలిపారు. ఆఫర్లు నమ్మి లోన్ తీసుకుంటే కాంటాక్ట్స్, గ్యాలరీ, తదితర వ్యక్తిగత సమాచారాన్ని యాప్ నిర్వాహకులకు యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుందని.. (అగ్రీ) ఆ పై వేధింపులు తప్పవన్నారు. ఫొటోలు మార్ఫింగ్ చేసి మీ వద్ద ఉన్న కాంటాక్ట్స్ అందరికీ పంపిస్తారన్నారు. త్వరగా లోన్ వస్తుందని ఆశపడితే బంధువులను సైతం రిస్క్‌లో పెట్టినట్టే అవుతారని ఎస్పీ హెచ్చరించారు.
పేపర్ డాక్యుమెంటేషన్ అవసరం ఉండదని, సులువుగా లోన్ పొందవచ్చని ప్రజలు లోన్ యాప్‌ల బారిన పడి తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని గుర్తుంచుకోవాలన్నారు. లోన్ యాప్ బాధితులకు పోలీసుశాఖ అండగా ఉంటుందని మీ సమీప పోలీ్‌సస్టేషన్‌లో లేదా జిల్లా పోలీస్ కార్యాలయంలో నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ తెలిపారు.