ఎండవేడిమితో ఇక్కట్లు పడిన భక్తులు

ABN , First Publish Date - 2022-04-11T05:05:42+05:30 IST

బ్రహ్మోత్సవాల్లో ఎండవేడిమిని దృష్టిలో ఉంచుకుని చలువపందిళ్లు, క్యూ లైన్లు ఏర్పాట్లు చేయడంలో టీటీ డీ, అధికార యంత్రాంగం విఫల మయ్యారు.

ఎండవేడిమితో ఇక్కట్లు పడిన భక్తులు
ఎండవేడిమికి క్యూలైన్లలో గంటల కొద్దీ వేచి ఉన్న వందలాది మంది భక్తులు

వాగ్వాదానికి దిగిన వైనం 

పోలీసులు, అధికారులపై విమర్శలు 

ఒంటిమిట్ట, ఏప్రిల్‌10: బ్రహ్మోత్సవాల్లో ఎండవేడిమిని దృష్టిలో ఉంచుకుని చలువపందిళ్లు, క్యూ లైన్లు ఏర్పాట్లు చేయడంలో టీటీ డీ, అధికార యంత్రాంగం విఫల మయ్యారు. చంటి బిడ్డలు, వృద్ధు భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు. ఆదివారం బ్రహ్మోత్సవాలను తిలకించి కోదండరామున్ని దర్శించుకునేందుకు ఊహించని రీతి లో వేలాది మంది భక్తజనం తరలివచ్చారు. క్యూలైన్లు, ఇతర ఏర్పాట్లు లేకపోవడంతో గంటల తరబడి భక్తులు క్యూలైన్‌లో నిలబడాల్సి వచ్చింది. ధ్వజారోహణం సందర్భంగా 300 మంది పోలీసులు, వారి బంధువులు రామాలయంలో ప్రవేశించడంతో భక్తులు లోనికి ప్రవేశించేందుకు వీలు లేకపోవడంతో తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.

దీంతో తొలి రోజే పోలీసుల తీరు విమర్శలకు గురి చేసింది.  భక్తులు గంటల కొద్దీ ఎండ వేడిమిని తట్టుకుని వేచి ఉండలేక టీటీడీ అధికారులు, పోలీసులతోనూ వాగ్వాదానికి దిగారు. విషయాన్ని గమనించి న టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఇంజనీరింగ్‌ అధికారుల ను ఆదేశించారు. కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి, సీఐ హనుమంతునాయక్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

Updated Date - 2022-04-11T05:05:42+05:30 IST