400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

ABN , First Publish Date - 2022-03-06T05:00:22+05:30 IST

జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, అక్రమ మద్యంపై ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ ఆదేశాల మేరకు శనివారం పోలీసు అధికారులు సిబ్బంది మెరుపుదాడులు నిర్వహించారు.

400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

కడప(క్రైం), మార్చి 5 : జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, అక్రమ మద్యంపై ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ ఆదేశాల మేరకు శనివారం పోలీసు అధికారులు సిబ్బంది మెరుపుదాడులు నిర్వహించారు. 400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసి ఒక కేసు  నమోదు చేశారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి 4 కేసులు నమోదు చేసి 4 టిప్పర్లు, 10.5 టన్నుల ఇసుక స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. 

Read more