ప్రజలకు వెలుగునిచ్చే కార్మికుల జీవితాల్లో చీకటి

ABN , First Publish Date - 2022-10-08T05:05:03+05:30 IST

విద్యుత్‌ లేనిదే ఒక్క నిమిషం కూడా గడపలేని ప్రస్తుత తరుణంలో, తమ జీవితాలను ఫణంగా పెట్టి 24/7 పనిచేసే విద్యుత్‌ కాంట్రాక్టు కార్మి కుల జీవితాలు మాత్రం చీకటిలో మగ్గుతున్నాయని కాంట్రాక్టు కార్మికుల జేఏసీ రాష్ట్ర కోఆర్టీనేటర్‌ దుర్గారావు పేర్కొన్నారు.

ప్రజలకు వెలుగునిచ్చే కార్మికుల జీవితాల్లో చీకటి
సమావేశంలో మాట్లాడుతున్న దుర్గారావు.

మూడన్నరేళ్లు అవుతున్నా క్రమబద్ధీకరణను పట్టించుకోని ప్రభుత్వం 

కాంట్రాక్టు కార్మికుల జేఏసీ రాష్ట్ర చీఫ్‌ కోఆర్డినేటర్‌ దుర్గారావు


ఎర్రగుంట్ల, అక్టోబరు 7: విద్యుత్‌ లేనిదే ఒక్క నిమిషం కూడా గడపలేని ప్రస్తుత తరుణంలో, తమ జీవితాలను ఫణంగా పెట్టి 24/7 పనిచేసే విద్యుత్‌ కాంట్రాక్టు కార్మి కుల జీవితాలు మాత్రం చీకటిలో మగ్గుతున్నాయని కాంట్రాక్టు కార్మికుల జేఏసీ రాష్ట్ర కోఆర్టీనేటర్‌ దుర్గారావు పేర్కొన్నారు. సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2017 నవంబ ర్‌లో పాదయాత్ర సందర్భంగా ఎర్రగుంట్లలో అప్పటి ప్రతిపక్షనేతగా ఎలాంటి షరతు ల్లేకుండా విద్యార్హత, వయస్సును పరిగణలోకి తీసుకుని క్రమబద్ధీకరస్తామని హామీ ఇచ్చారన్నారు. మూడు న్నరేళ్లు గడుస్తున్నా పట్టించుకోకపోవడం దారుణ మని విమర్శించారు. శుక్రవారం రాత్రి ఆర్టీపీపీలో విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుల రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు స్థానిక జేఏసీ ఆధ్వర్యంలో సంస్థలో విలీనం, రెగ్యులరైజేషన్‌, సమాన పనికి సమానవేతనం ఇవ్వాలనే డిమాండ్లతో  బహిరంగసభ  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజ రైన దుర్గారావు, రాష్ట్ర జేఏసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌లు మాట్లా డుతూ ఇచ్చిన హామీని యాజమాన్యాలు, జగన్‌ ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయకపోవడంతో కార్మికులు నిరాశ, నిస్పృహలకు గురయ్యా రన్నారు. ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు చాలి చాలనీ జీతాలతో పనిచేస్తున్నారన్నారు. కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో యాజమాన్యాలకు, ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించినా కనీస సమాధానం కూడా లేదన్నారు. విధిలేని పరిస్థితుల్లో రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొందని, ఈపరిస్థితికి ప్రభుత్వాలే కారణమన్నారు. ఇప్పటికైనా యాజమాన్యాలు, ప్రభుత్వం తీరు మార్చుకుని  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగా కాంట్రాక్టు కార్మి కుల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు.  కార్యక్రమానికి 1535, ఏఐటీయూసీ 64, సీఐటీయు, 155 యూనియన్‌ నాయకులు రామక్రిష్ణారెడ్డి, కొండారెడ్డి, శ్రీనివాసులు, శివయ్య ఆర్టీపీపీ రిజినల్‌ జేఏసీ నాయకులు శ్రీనివాసులు, రాము, నాగేంద్ర, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.  

Read more