కాలం చెల్లిన మందులతో ప్రమాదం

ABN , First Publish Date - 2022-07-19T04:38:17+05:30 IST

కాలం చెల్లిన మందులు పంపిణీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డీఎంహెచ్‌వో ఎస్‌.చిన్నికృష్ణయ్య హెచ్చరించారు.

కాలం చెల్లిన మందులతో ప్రమాదం
మందుల గదిని పరిశీలిస్తున్న డీవైడీఎంహెచ్‌వో

ఓబులవారిపల్లె, జూలై18 : కాలం చెల్లిన మందులు పంపిణీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డీఎంహెచ్‌వో ఎస్‌.చిన్నికృష్ణయ్య హెచ్చరించారు. కాలం చెల్లిన మందుల పంపిణీపై వచ్చిన ఫిర్యాదు మేరకు మండలంలోని వై.కోట ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం రాజంపేట డివిజన్‌ డిప్యూటీ డీఎం హెచ్‌వో, అధికారులు తనిఖీ చేశారు.  ఫార్మసిస్ట్‌ లక్ష్మీకర్‌ను పిలిపించి వివరాలు తెలుసు కున్నారు.. రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదని మండిపడ్డారు. ఫార్మసిస్ట్‌ లక్ష్మీకర్‌కు మెమో జారీ చేస్తున్నట్లు తెలి పారు.  సీనియర్‌ అసిస్టెంట్‌ యు.సిద్ది రామయ్య, సబ్‌ యూనిట్‌ అధికారి స్వామి, డాక్టర్‌ దేవేందర్‌రెడ్డి, డాక్టర్‌ రవికిరణ్‌, వైద్య సహాయకులు పాల్గొన్నారు. 

Read more