కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంటు చేయాలి
ABN , First Publish Date - 2022-12-15T23:59:53+05:30 IST
కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంటు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి పిలుపునిచ్చారు.
- ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి
కడప (ఎర్రముక్కపల్లె), డిసెంబరు 15: కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంటు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం వారు కేరళ రాష్ట్రం వెళుతూ కడప రైల్వేస్టేషనలో మాట్లాడారు. డిసెంబరులో 16 నుంచి 20 వరకు జాతీయ మహాసభలు జరగనున్నాయని, ఈ మహాసభల ద్వార భవిష్యత కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఏఐటీయూసీ జిల్లా నాయకులు కేసీ బాదుల్లా, అంగన్వాడీ యూనియన జిల్లా నాయకులు మంజుల, ఆశా కర్యాకర్తల యూనియన జిల్లా అధ్యక్షురాలు సుభాషిణి, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మద్దిలేటి, నాయకులు చంద్రశేఖర్ పాల్గొన్నారు.