మైలవరం నుంచి పెన్నాకు కొనసాగుతున్న నీటి విడుదల

ABN , First Publish Date - 2022-10-02T05:30:00+05:30 IST

మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి 7,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు మైలవరం జలాశయ ఏఈఈ గౌతమ్‌రెడ్డి ఆదివారం తెలిపారు.

మైలవరం నుంచి పెన్నాకు కొనసాగుతున్న నీటి విడుదల
. మైలవరం నుంచి పెన్నానదికి నీటిని విడుదల చేస్తున్న దృశ్యం

మైలవరం, అక్టోబరు 2: మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి 7,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు మైలవరం జలాశయ ఏఈఈ గౌతమ్‌రెడ్డి ఆదివారం తెలిపారు. గండికోట జలాశయం నుంచి మైలవరం జలాశయానికి 7 వేల క్యూసెక్కుల మేర నీరు వచ్చి చేరుతుండటంతో పెన్నాకు 7,400 క్యూసెక్కులు వదులుతున్నారు. ఉత్తరకాలువకు 150 క్యూసెక్కులు, దక్షిణ కాలువకు 150 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మైలవరం జలాశయం పూర్తి సామర్థ్యం 6.500 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.800 టీఎంసీలు.  గండికోట జలాశయం నుంచి మైలవరానికి ఇన్‌ఫ్లో పెరిగితే పెన్నానదికి మరింత నీటిని వదిలే అవకాశం ఉందని, పెన్నా పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలాశయ అధికారులు తెలిపారు.

Read more