ఓటు ప్రాధాన్యంపై పోటీలు : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-02-17T05:12:53+05:30 IST

ఓటు ప్రాముఖ్యతను తెలియజేయడానికి మార్చి 25 వరకు పోటీలు ఉంటాయని కలెక్టర్‌, ఎన్నికల అధికారి వి.విజయరామరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్విజ్‌, పాటల పోటీ, వీడియో మేకింగ్‌, నినాదాల పోటీలు ఉంటాయన్నారు.

ఓటు ప్రాధాన్యంపై పోటీలు : కలెక్టర్‌

కడప(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 16: ఓటు ప్రాముఖ్యతను తెలియజేయడానికి మార్చి 25 వరకు పోటీలు ఉంటాయని కలెక్టర్‌, ఎన్నికల అధికారి వి.విజయరామరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్విజ్‌, పాటల పోటీ, వీడియో మేకింగ్‌, నినాదాల పోటీలు ఉంటాయన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ ఉత్తమ ఎంపికలకు రూ.లక్ష నుంచి రూ.20 వేల వరకు బహుమతులుంటాయన్నారు. ఆసక్తి గల వారు ఈసీఎల్‌ఎస్‌వీఈఈపీ.ఎన్‌ఐసీ.ఇన్‌/సీఓఎన్‌టీఈఎస్‌టీ వెబ్‌సైట్‌లో పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.

Read more