సిద్ధ్దేశ్వరం అలుగు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలి : కుంచం

ABN , First Publish Date - 2022-11-30T23:53:58+05:30 IST

రాయలసీమ నీటి సమస్యకు పరిష్కారమైన సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్టును నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టాలని రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండు చేశారు.

సిద్ధ్దేశ్వరం అలుగు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలి : కుంచం

ప్రొద్దుటూరు క్రైం, నవంబరు 30 : రాయలసీమ నీటి సమస్యకు పరిష్కారమైన సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్టును నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టాలని రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి బహిరంగలేఖ పంపారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో కుంచం విలేఖరులతో మాట్లాడుతూ రాయలసీమ ప్రజల డిమాండు అయిన సిద్ధ్దేశ్వరం అలుగు ప్రాజెక్టు నిర్మాణాన్ని సత్వరం చేపట్టాలని ఆయన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ ప్రధాన సలహాదారుడు సోమసుందర్‌రెడ్డి, సమన్వయకర్త క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T23:54:11+05:30 IST

Read more