నియోజకవర్గానికే తలమానికం కేంద్రీయ విద్యాలయం
ABN , First Publish Date - 2022-12-15T23:44:42+05:30 IST
రాజంపేటకు మంజూరైన కేంద్రీయ విద్యాలయం రాజంపేట నియోజకవర్గానికే తలమానికమని రాజంపేట బీజేపీ పార్లమెంటరీ ఇన్‌చార్జి సాయిలోకేశ్ పేర్కొన్నారు.
రాజంపేట బీజేపీ పార్లమెంటరీ ఇన్‌చార్జి సాయిలోకేశ్
రాయచోటి(కలెక్టరేట్), డిసెంబరు 15: రాజంపేటకు మంజూరైన కేంద్రీయ విద్యాలయం రాజంపేట నియోజకవర్గానికే తలమానికమని రాజంపేట బీజేపీ పార్లమెంటరీ ఇన్‌చార్జి సాయిలోకేశ్ పేర్కొన్నారు. ఈ విషయంపై గురువారం ఆయన కలెక్టర్ గిరీషాను కలిసి కేంద్రీయ విద్యాలయం నడుస్తున్న బిల్డింగ్ వసతులు, మరుగుదొడ్ల కోసం తాత్కాలికంగా నిధులను మంజూరు చేయాలని కోరారు. 2016లో కేంద్రీయ విద్యాలయం మంజూరైనా ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు స్థల సేకరణ చేయకపోవడం దారుణమన్నారు. కేంద్రం 2021లో పర్మినెంట్ బిల్డింగ్ కోసం రూ.18 కోట్ల 56 లక్షలు మంజూరు చేసినా ఇప్పటి వరకు వాటిని వాడుకోవడంలో ప్రజాప్రతినిధులు విఫలమయ్యారన్నారు. కాగా ఈ నెల 10న కలెక్టర్ చొరవతో స్థల పరిశీలన జరిగి, అదేరోజు కేంద్రీయ విద్యాలయ అధికారులు ఆ స్థలాన్ని అంగీకరించినట్లు తెలిపారు. ఆ స్థలం కేంద్రీయ విద్యాలయానికి అప్పగించి త్వరితగతిన పనులు ప్రారంభించేలా చూడాలని కలెక్టర్‌కు విన్నవించారు. ఆయన వెంట బీజేపీ కార్యకర్తలు, వీఆర్‌డీఎస్ సురేంద్రారెడ్డిలు పాల్గొన్నారు.