అమృత నగర్ సమస్యలపై ఆందోళన
ABN , First Publish Date - 2022-06-28T05:29:37+05:30 IST
కొత్త పల్లె పంచాయతీ అమృత నగర్లో ఏళ్ళతరబడి వున్న సమస్యలు పరిష్కరించటంలో అధికారుల వైఫల్యాలపై సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

తహసీల్దారు కార్యాలయాన్ని చుట్టుముట్టిన వైనం
ప్రొద్దుటూరు అర్బన్, జూన్ 27 : కొత్త పల్లె పంచాయతీ అమృత నగర్లో ఏళ్ళతరబడి వున్న సమస్యలు పరిష్కరించటంలో అధికారుల వైఫల్యాలపై సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.సోమవారం స్థానిక తహసీల్దారు కార్యాలయం వద్ద అమృతనగర్ వాసులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.ఈ సందర్బంగా సీపీఎం కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ గత 2018 టీడీపీ ప్రభుత్వంలో పట్టాలిచ్చి 2021లో స్థలాలుచూపారన్నారు. లబ్ధిదారులు ఇళ్ళు నిర్మిం చుకోవడానికి హౌసింగ్ రుణాలు మంజూరు చేయడంలేదన్నారు. ఇంకా ఆ లేఅవుట్లో రోడ్లు ,కాలువలు విద్యుత్ తాగునీటి పైప్‌లైను లాంటి మౌలిక వసతులు కలించలేదన్నారు. నిన్న ఇచ్చిన జగనన్న ఇళ్ళకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. తహసీల్దారు నజీర్ అహ్మద్ స్పందించకుంటే కార్యాలయంలోకి వెళ్ళి ఆయనను చుట్టుముట్టి సమస్యలపై పరిష్కారం చూపాలని మాట్లాడారు. దీంతో ఎంపీడీవో ఉపేంద్రరెడ్డి కొత్తపల్లె కార్యదర్శి పుల్లారెడ్డిని పిలిపించి చర్చించారు. జులై 11 లోపు సమస్యలపై స్పందిచకుంటే తాము కలెక్టరేట్ ధర్నా చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు బాలసుబ్బయ్య, శేఖర్‌రెడ్డి, చెన్నారెడి,్డ వెంకటసుబ్బమ్మ, నయోమి ,రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.