నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయండి
ABN , First Publish Date - 2022-08-05T04:44:54+05:30 IST
రెండో విడత మనబడి నాడు- నేడు పనులు చురుగ్గా జరగాలని నాణ్యతలో ఎటువంటి రాజీ పడవద్దని అధికారులను విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ ఆదేశించారు.
విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్
రాయచోటి(కలెక్టరేట్), ఆగస్టు4: రెండో విడత మనబడి నాడు- నేడు పనులు చురుగ్గా జరగాలని నాణ్యతలో ఎటువంటి రాజీ పడవద్దని అధికారులను విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ ఆదేశించారు. విజయవాడ నుంచి విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రెండో విడత నాడు- నేడు పనులను సత్వరం పూర్తి చేయాలని, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు, విశాలమైన తరగతి గదులను అందుబా టులోకి తీసుకొచ్చేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. మంజూరైన పాఠశాలకు సంబంధించి అడ్మినిస్ర్టేషన్ శాంక్షన్, ఎక్స్పెండీచర్ జనరేట్, బిల్స్ అప్లోడ్, ఇసుక స్టాక్ పాయింట్లు, సిమెంటు ఇండెంట్, ఫర్నీచర్, గ్రీన్ చాక్బోర్డ్స్, ఫ్యాన్స్, పెయింటింగ్, ఇంగ్లీష్ ల్యాబ్, రూఫ్ రిపేర్స్, ఎలక్ర్టికల్ వర్క్స్ తదితర పనుల కోసం ఇండెంట్ రైజ్ చేయాలన్నా రు.
ఆగస్టు పదిలోగా మనబడి నాడు- నేడు పనులు వందశాతం గ్రౌండింగ్ జరగాల న్నారు. మనబడి నాడు- నేడు పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడ వద్దని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ నూతన భవనాలకు మంజూరైన పాఠశాలలకు సంబంధించి ఎస్టిమేషన్స్, అడ్మినిస్ర్టేషన్ శాంక్షన్, టెక్నికల్ శాంక్షన్లు, ఎంఓయూ సైన్ అప్రూవల్ పెండింగ్ లేకుండా సత్వరమే క్లియర్ చేయాలన్నారు. ఆ పనులను వెంటనే మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించారు. కాన్ఫరెన్స్లో డీఈఓ రాఘవరెడ్డి, సమగ్ర శిక్ష ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.