ఆర్‌ఓఆర్‌ను త్వరగా పూర్తి చేయండి
ABN , First Publish Date - 2022-08-05T04:52:28+05:30 IST
లక్ష్యం మేరకు గ్రౌండ్ ట్రూతింగ్, ఫైనల్ ఆర్‌ఓఆర్ ప్రక్రియను త్వర గా పూర్తి చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సీసీఎల్ ఏ ప్రత్యేక ప్రధాన కార్యద ర్శి సాయిప్రసాద్ ఆదేశిం చారు.
మ్యుటేషన్ దరఖాస్తులను పరిష్కరించండి
కలెక్టర్లతో సమీక్షించిన సీసీఎల్‌ఏ ప్రత్యే ప్రధాన కార్యదర్శి
రాయచోటి(కలెక్టరేట్), ఆగస్టు4: లక్ష్యం మేరకు గ్రౌండ్ ట్రూతింగ్, ఫైనల్ ఆర్‌ఓఆర్ ప్రక్రియను త్వర గా పూర్తి చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సీసీఎల్ ఏ ప్రత్యేక ప్రధాన కార్యద ర్శి సాయిప్రసాద్ ఆదేశిం చారు. గురువారం విజయ వాడలోని తన కార్యాల యం నుంచి సీసీఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ సంబంధిత శాఖల కార్యదర్శులతో కలిసి వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం (సమగ్రస ర్వే) కార్యాచరణ అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
మ్యుటేషన్ కరెక్షన్, ట్రాన్సాక్షన్, మ్యుటేషన్ రిజెక్ట్ కారణాలు, పీఓఎల్‌ఆర్, ఫ్రీ డ్రోన్ ఫ్లయింగ్, పోస్ట్ డ్రోన్ ఫ్లయింగ్, డేటా ఎంట్రీ, 22(ఏ) లేయర్స్, కంప్టేషన్స్ 5 లేయర్ డేటా ఎంట్రీ, 22(ఏ) కేసులు, చుక్కల భూములు, ఇన్‌కం, క్యాస్ట్, ఫ్యామిలీ మెం బర్ సర్టిఫికెట్లు, ఎంక్రోచ్‌మెంట్స్, కోర్టు కేసులో పురోగతి, రెవెన్యూ రికార్డుల తయారీ, నవీకరణ, నిర్వహణ తదితర అంశాలపై కలెక్టర్లతో సీసీఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమీక్షించారు. అనంతరం అన్నమయ్య జిల్లా కలెక్టర్ పీఎస్ గిరీషా మాట్లాడుతూ గ్రౌండ్ ట్రూతింగ్ 49 గ్రామాల్లో పూర్తి చేశామని, ఇంకా 35 గ్రామాల్లో చేయాల్సి ఉంద ని, ఆ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఫైనల్ ఆర్‌ఓఆర్ 11 చేశామని, మిగిలినవ న్నీ కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. సమగ్ర భూసర్వేను ఆలస్యం చేయకుండా మంద గమనంలో ఉన్న సమగ్ర భూసర్వే పనులను పరుగులు పెట్టించాలని అధికారు లను కలెక్టర్ ఆదేశించారు. మ్యుటేషన్ దరఖాస్తుల మీద ప్రత్యేక దృష్టి పెట్టి పెండింగ్ లేకుండా క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ పీఎస్ గిరీషా, జేసీ తమీమ్ అన్సారియా, డీఆర్‌ఓ సత్య నారాయణ, భూముల సర్వే విభాగం సహాయ సంచాలకులు జయరాజ్ పాల్గొన్నారు.
లక్ష్యసాధన దిశగా భూ రీసర్వే : కలెక్టర్
కడప(కలెక్టరేట్), ఆగస్టు4: రెవె న్యూ భూముల స్వచ్ఛీకరణలో భాగంగా ప్రభుత్వం చేపడుతు న్న రీ సర్వే పనులు జిల్లాలో లక్ష్యసాధన దిశగా సాగుతున్నాయని కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. గురువారం వి జయవాడ నుంచి రాష్ట్ర భూపరిపాలనా శాఖ కమిషనరు సా యి ప్రసాద్ సంబంధిత శాఖల కార్యదర్శులతో జగనన్న శా శ్వత భూ హక్కు- భూరక్ష పథకం కార్యాచరణ అమలుపై కలెక్టర్లు, జేసీలతో నిర్వహించిన వీడియో కాన్పెరెన్సులో కలెక్ట ర్ జిల్లాలో జరుగుతున్న రీసర్వే పనుల పురోగతిని సీసీఎల్ ఏ కమీషనరుకు వివరించారు.
మూడు రెవెన్యూ డివిజన్లు సహా కొత్తగా ఏర్పాటైన పులివెందుల రెవెన్యూడివిజన్‌కు పరిఽధులు నిర్ణయించి రీసర్వే పనులు చేపట్టాల్సి ఉందన్నారు అంతకు ముందు సీసీఎల్‌ఏ కమీషనరు మాట్లాడుతూ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకంలో భాగంగా జిల్లా ల వారీ ఎంపిక చేసిన గ్రామాల్లో భూరికార్డుల స్వచ్ఛీకరణ, రీసర్వే పనులు నిర్ధేశించిన గడువులోగా పూర్తి చేయాలనీ ఆదేశించారు. కార్యక్రమంలో ల్యాండ్ సర్వే శాఖ ఏడీ కనక ప్రసాదరావు, ఎస్డీసీ ఎల్.ఏ శాంతమ్మ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
