భర్త కనిపించలేదంటూ ఫిర్యాదు
ABN , First Publish Date - 2022-10-18T05:01:52+05:30 IST
స్థానిక వినాయకనగర్‌లో కేతన్ టెక్స్‌టైల్స్ బట్టల దుకాణాన్ని నిర్వహిస్తున్న శ్రీనివాసులు సోమవారం ఉదయం బయ టకి వెళ్లి కనిపించకుండా పోయాడని ఆయన భార్య రూరల్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
బద్వేలు రూరల్, అక్టోబరు 17 : స్థానిక వినాయకనగర్‌లో కేతన్ టెక్స్‌టైల్స్ బట్టల దుకాణాన్ని నిర్వహిస్తున్న శ్రీనివాసులు సోమవారం ఉదయం బయ టకి వెళ్లి కనిపించకుండా పోయాడని ఆయన భార్య రూరల్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె తెలిపిన వివరాల మేర కు... దుకాణంలో వ్యాపారం సరిగా జరగ లేదంటూ ఇటీవల కాలంలో ముభా వంగా ఉండడం, సోమవారం ఉదయం 6.30 గంటల సమయంలో ఇంటి వద్ద నుంచి బయటికి వెళ్లాడు. ఆ తరువాత ఫోను చేస్తే ఎత్తలేదని తెలిపింది. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో సిద్దమ్మపేరంటాలు సమీపంలో ఓ వ్యక్తి ఫోన్ ఎత్తి ఓ మోటరు సైకిలు, ఓ సెల్‌ఫోన్ ఇక్కడ ఉంది... ఇక్కడ ఎవరూ లేరని తెలపడంతో బంధువులతో కలిసి అక్కడికి వెళ్లి ఆప్రాం తమంతా గాలించామని, అయితే ఆచూకీ తెలియలేదని ఆమె పోలీ సుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.