బాలుడి అదృశ్యంపై ఫిర్యాదు
ABN , First Publish Date - 2022-12-16T00:06:33+05:30 IST
స్కూలుకు వెళ్లిన తన మనవడు సఫీర్ అహ్మ ద్(8) అదృశ్యమయ్యాడని పీలేరు పట్టణం నెహ్రూ బజారుకు చెంది న సిరాజ్ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పీలేరు, డిసెంబరు 15: స్కూలుకు వెళ్లిన తన మనవడు సఫీర్ అహ్మ ద్(8) అదృశ్యమయ్యాడని పీలేరు పట్టణం నెహ్రూ బజారుకు చెంది న సిరాజ్ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె కథనం మేర కు ఆమె మనవడు సఫీర్ అహ్మద్ పట్టణంలోని కాకతీయ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడని ఎప్పటి లాగే గురువారం ఉదయం సఫీర్‌ను స్కూలు వద్ద దిగబెట్టి వచ్చిన ఆమె మధ్యాహ్న భోజనానికి అతను ఇంటికి రాకపోవడంతో స్కూలు వద్దకు వెళ్లి వాకబు చేయగా పిల్లాడిని ఎవరో మహిళ తీసుకెళ్లినట్లు స్కూలు సిబ్బంది తెలిపారు. దీంతో ఆందోళనకు గురైన ఆమె బం ధువులు, తెలిసిన వాళ్ల ఇళ్లలో వెతికి లాభం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీలేరు పోలీసులు సీసీ కెమెరాల సాయంతో కేసు విచారిస్తున్నారు.
కాలువలో పడి యువకుడి మృతి
మదనపల్లె క్రైం, డిసెంబరు 15: మురుగునీటి కాలువలో పడి హుస్సేనఖాన(17)అనే యువకుడు మృతిచెందాడు. మదనపల్లెపట్టణంలోని అనం తయ్య బంగ్లావీధికి చెందిన హుస్సేనఖాన మూర్చ రోగి. ఈనేపథ్యంలో బుధవారం రాత్రి పట్టణంలో నుంచి నడుచుకుని ఇంటికి వెళుతుండగా దారిలో మూర్చ రావడంతో హోప్ హైస్కూల్ వద్దనున్న మురుగునీటి కాలువలో పడిపోయాడు. అయితే ఆ సమయంలో ఎవరూ గుర్తించకపోవడంతో మురుగులో పడి ఊపిరాడక మృతిచెందా డు. కాగా గురువారం ఉదయం స్థానికులు గుర్తించి వనటౌన పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలా నికి చేరుకుని మృతదేహాన్ని బాధిత కుటుంబీకులకు సమాచా రం అందించారు. అనంతరం మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వా స్పత్రికి తరలించి కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ హరిహరప్ర సాద్ చెప్పారు.