-
-
Home » Andhra Pradesh » Kadapa » Collect details of those who have lost places-MRGS-AndhraPradesh
-
స్థలాలు కోల్పోయిన వారి వివరాలు సేకరించండి
ABN , First Publish Date - 2022-10-12T04:40:43+05:30 IST
రాయచోటి- వేంపల్లె జాతీయ రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పో తున్న వారి వివరాలు సేకరించా లని అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదే శించారు.

లక్కిరెడ్డిపల్లె, అక్టోబరు 11: రాయచోటి- వేంపల్లె జాతీయ రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పో తున్న వారి వివరాలు సేకరించా లని అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదే శించారు. మంగళవారం లక్కిరెడ్డి పల్లెలోని జాతీయ రహదారికి సేక రించనున్న స్థలాలను పరిశీలించారు. రైతు లను ఇబ్బందులు పెట్టకుండా నిష్పక్షపాతంగా, వేగవంతంగా రీసర్వే చేయా లన్నారు. జగనన్న ఇంటి స్థలాలకు సంబంధించి సకాలంలో ఈకేవైసీ చేయించాలన్నారు. ఓటరు నమోదుకు ఆధార్ లింకు పనులు కూడా వేగవం తం చేయా లన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగప్రసన్నలక్ష్మి, ఆర్‌ఐ సమ్మతఖాన, జాతీయ రహదారి ఇంజనీర్ రఘునాఽథ, మండల సర్వేయర్ బాబాకరీముల్లా, వీఆర్‌వోలు శంకరయ్య, బాషావలి పాల్గొన్నారు.