వైసీపీలో ఇరువర్గాల ఘర్షణ
ABN , First Publish Date - 2022-12-15T23:16:51+05:30 IST
అధికార వైసీపీలో ఇరువర్గాల నడు మ ఘర్షణ జరిగింది. ఈ ఘటన స్థానిక శ్రీరాములపేటలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
ప్రొద్దుటూరు క్రైం, డిసెంబరు 15: అధికార వైసీపీలో ఇరువర్గాల నడు మ ఘర్షణ జరిగింది. ఈ ఘటన స్థానిక శ్రీరాములపేటలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వర్గీయులు ఒకరికొకరు ఎదురుపడడంతో తొలుత వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్తా ఘర్షణకు దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు సకాలంలో అక్కడికి చేరుకుని ఘర్షణను నివారించారు. జరిగిన ఘటనపై ఇరువర్గాల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందనట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, తిరిగి ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా పికెటింగ్ ఏర్పాటు చేశారు.