ఉపాధి హామీ, ఆవాస్‌ యోజన పనులపై కేంద్ర బృందం పరిశీలన

ABN , First Publish Date - 2022-01-24T04:26:03+05:30 IST

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకాల అమలు పనుల తీరును క్షేత్ర స్థాయిలో కేంద్ర బృందం వారం రోజుల పాటు జిల్లాలో పరిశీలించినట్లు డ్వామా పీడీ యఽధుభూషణ్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఉపాధి హామీ, ఆవాస్‌ యోజన పనులపై కేంద్ర బృందం పరిశీలన

కడప (నాగరాజుపేట), జనవరి 23: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకాల అమలు పనుల తీరును క్షేత్ర స్థాయిలో కేంద్ర బృందం వారం రోజుల పాటు జిల్లాలో పరిశీలించినట్లు డ్వామా పీడీ యఽధుభూషణ్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర బృందం సభ్యులు అనిల్‌కుమార్‌,  సుబ్రమణ్యంరెడ్డిలు నాలుగు మండలాల్లోని 12 గ్రామ పంచాయతీలలో పర్యటించారన్నారు. పోరుమామిళ్ళ మండలంలో అక్కల్‌రెడ్డిపల్లె, రంగసముద్రం, సిద్దవరం, లక్కిరెడ్డిపల్లె మండలంలోని దప్పేపల్లి కుర్నూతల, గాలివీడు మండలంలో అరవీడు, ఎగువగొట్టివీడు, చీమలచెరువుపల్లె, రామాపురం మండలంలో శుద్దమళ్ల, హసనాపురం, రాచపల్లె పంచాయతీలలో పర్యటించినట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన కందకాలు, నీటి నిల్వ కుంటలు, ఫారంపాండ్స్‌, పంట కాలువలు, పశువుల కుంటలు, పండ్ల తోటల పెంపకం, రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కల పెంపకం, నూర్పిడి కలాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల తీరుపై కలెక్టర్‌, జేసీలు కలెక్టర్‌ నివేదికలు అందజేసినట్లు తెలిపారు. 

Read more