‘మైనార్టీల పట్ల కేంద్రం వివక్ష మానుకోవాలి’
ABN , First Publish Date - 2022-12-16T23:11:52+05:30 IST
మైనార్టీ విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష మానుకోవాలని ఏఐఎ్‌సఎఫ్ జిల్లా కార్యదర్శి వలరాజు, ఇన్సాఫ్ నగర కార్యదర్శి మైనుద్దీన్ పేర్కొన్నారు.
కడప (ఎర్రముక్కపల్లె), డిసెంబరు 16: మైనార్టీ విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష మానుకోవాలని ఏఐఎ్‌సఎఫ్ జిల్లా కార్యదర్శి వలరాజు, ఇన్సాఫ్ నగర కార్యదర్శి మైనుద్దీన్ పేర్కొన్నారు. ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్, మౌలానా నేషనల్ షెలోషి్‌పను కొనసాగించాలని డిమాండ్ చేశారు. కడప నగరం ఆర్డీఓ కార్యాలంయ ఎదుట శుక్రవారం ఏఐఎ్‌సఎఫ్, ఇన్సాఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడుతూ కేంద్రం విద్యారంగంలో సమూల మార్పులు చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను చదువుకు దూ రం చేసేలా ప్రయత్నిస్తోందన్నారు. విద్యావ్యవస్థపై అడుగడుగునా ఫాసిస్టు ధోరణులు రుద్దుతున్నారని ఆరోపించారు. అందులో భాగంగా 1 నుంచి 8వతరగతి వరకు ఉన్న ప్రీ మెట్రిక్ ష్కాలర్‌షి్‌పలను ఎంఫిల్, పీహెచ్‌డీ విద్యార్థులకు మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషి్‌పలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం దుర్మార్గమన్నారు. మైనార్టీలు విద్యలో వెనుకపాటుకు గురవుతున్నారని, చదువుకునే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. 2006లో సచార్ కమిటీ నివేదిక ప్రకారం 2009లో మౌలానా ఆజాద్ ఫెలోషిప్ ప్రవేశపెట్టారన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చింది మొదలుకొని ప్రభుత్వం విద్యను నిర్వీర్యం చేస్తూ శాస్ర్తీయ విద్య అటకెక్కించే విధంగా కాషాయీకరణ విద్యార్థుల వైపు రుద్దుతూ విద్యావ్యవస్థలో మార్పులు చేస్తోందని ఆరోపించారు.
ఈ నెల 8న కేంద్ర మైనార్టీశాఖ మంత్రి స్మృతిఇరాని పార్లమెంటు సాక్షిగా సెక్యులర్ దేశమని విద్యార్థులంతా సమానమ ని నమ్మబలుకుతూ చెబుతూ మైనార్టీ విద్యార్థుల స్కాలర్‌షి్‌పల రద్దు చేస్తున్నామని చెప్పారన్నారు. తగిన నిధులు కేటాయించకుండా ఎలిమెంటరీ మొదలు కొని ఎంఫిల్,పీహెచ్‌డీ విద్యార్థుల వరకు మైనార్టీలకు స్కాలర్‌షి్‌పలు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని విమర్శించారు. తక్షణం బీజేపీ ప్రభుత్వం స్కాలర్‌షి్‌పలను తిరిగి కొనసాగించాలని లేదంటే దేశ వ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంత రం ఆర్డీఓ ఏఓకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఇన్సాఫ్ నేతలు షేక్ గౌస్, హుసేన్, నాగరాజు, ఏఐఎ్‌సఎఫ్ నేతలు శివశంకర్, అరుణ్, బీహెచ్‌పీఎస్ నేతలు మునె య్య, మైనార్టీ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు దస్తగిరితోపాటు పలువురు పాల్గొన్నారు.