ముగ్గురు ప్రైవేట్ చిట్‌ఫండ్ నిర్వాహకులపై కేసు నమోదు
ABN , First Publish Date - 2022-01-13T05:38:47+05:30 IST
కడప నగరం నాగరాజుపేటలో ఓ చిట్‌ఫండ్ ఫైనాన్స్ సంస్థ నిర్వాహకులైన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ ఎస్‌ఐ సిద్ధయ్య తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు..
కడప(క్రైం), జనవరి 12: కడప నగరం నాగరాజుపేటలో ఓ చిట్‌ఫండ్ ఫైనాన్స్ సంస్థ నిర్వాహకులైన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ ఎస్‌ఐ సిద్ధయ్య తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. ఏఆర్ కానిస్టేబుల్ నంద్యాల వెంకటసుబ్బయ్య 2017లో తన భార్య లక్ష్మీప్రసన్న, బావమరిది ప్రసన్నకుమార్ పేరు మీద చిట్‌ఫండ్ ఫైనాన్స్ సంస్థ ఏర్పాటు చేశారని, సంస్థ రిజిస్ర్టేషన్ చేసి రెన్యూవల్ చేయకుండా భారీగా ఖాతాదారులను చేర్పించుకున్నట్లు తెలిపారు. కడపకు చెందిన రేవతి మరికొందరితో కలిసి రూ.4.20 లక్షల చీటీలు వేసి అందుకు సంబంఽఽధించిన కంతులన్నీ పూర్తి చేసిందని, ఆరు నెలల నుంచి ఆ మొత్తాన్ని తమకు ఇవ్వాలని అడుగుతున్నప్పటికీ స్పందించలేదని తెలిపారు. డబ్బులు అడిగేందుకు నాగరాజుపేటలోని చిట్‌ఫండ్ కార్యాలయానికి వెళ్లిన రేవతిపై వెంటకసుబ్బయ్య దూషించి దాడి చేసినట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు చిట్‌ఫండ్ నిర్వాహకులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.