చెరువులకు గండి పడకుండా జాగ్రత్త తీసుకోవాలి
ABN , First Publish Date - 2022-08-05T05:10:13+05:30 IST
రాబోయే భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గ పరిధిలో వాగులు, వంకలు చెరువులకు గండి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నియోజకవర్గ స్ఫెషల్ ఆఫీసర్లు శ్రీనివాసులరెడ్డి, చిన్నరాముడు అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.
నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు శ్రీనివాసులరెడ్డి, చిన్నరాముడు
ప్రొద్దుటూరు అర్బన్ ఆగస్టు 4 : రాబోయే భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గ పరిధిలో వాగులు, వంకలు చెరువులకు గండి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నియోజకవర్గ స్ఫెషల్ ఆఫీసర్లు శ్రీనివాసులరెడ్డి, చిన్నరాముడు అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. గురువారం స్థానిక తహసీల్దారు కార్యాలయంలో ప్రొద్దుటూరు తహసీల్దారు నజీర్అహ్మద్, రాజుపాళెం తహసీల్దారు ఇందిరారాణిలతో వర్షప్రభావాలపై చర్చించారు. కుందూ నదిలో వస్తున్న నీటి ప్రవాహంపై ఆరా తీశారు. తెలుగు గంగ మైదుకూరు డివిజన్ డీఈ బ్రహ్మానందరెడ్డి తో ఫోన్లో మాట్లాడారు.ప్రస్తుతానికి 10 వేల క్యూసెక్కులు మాత్రమే కుందూలో ప్రవహిస్తున్నాయన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి నీరు విడుదల చేస్తున్నవి మాత్రమే వస్తున్నాయన్నారు.కుందూ పరీవాహంలో వర్షాలు పెద్దగా లేవన్నారు. ఉధృతంగా పారుతున్న పాపాఘ్ని నదీ ప్రవాహంపై కూడా ఆరా తీశారు.రాజుపాళెం, ప్రొద్దుటూరు మండలాల పరిధిలో వున్న చెరువులు, కుంటలు గండి పడకుండా పర్యవేక్షణ వుండాలన్నారు.సమావేశంలో డీటీ మనోహర్‌రెడ్డి, ఆర్ఐలు సతీష్, సుదర్శన్ పాల్గొన్నారు.