బయోమెట్రిక్‌ తప్పనిసరి: ఎంపీడీఓ

ABN , First Publish Date - 2022-08-26T04:55:02+05:30 IST

సచివాలయ ఉద్యోగులు బయోమెట్రిక్‌ తప్పనిసరిగా వేయాలని ఎంపీడీవో హైదర్‌వలి తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో గురువారం సచివాలయ సిబ్బందికి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు.

బయోమెట్రిక్‌ తప్పనిసరి: ఎంపీడీఓ
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీడీవో

రామాపురం, ఆగస్టు 25: సచివాలయ ఉద్యోగులు బయోమెట్రిక్‌ తప్పనిసరిగా వేయాలని ఎంపీడీవో హైదర్‌వలి తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో గురువారం సచివాలయ సిబ్బందికి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతిరోజు ఉదయం 10.30 గంటలకే సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్‌ తప్పనిసరిగా వేయాలన్నారు. కార్యక్రమంలో ఈవోపీఆర్‌డీ ఉషారాణి, ఏవో శివశంకర్‌, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. 

Read more