-
-
Home » Andhra Pradesh » Kadapa » Bankers should provide housing loans quickly-MRGS-AndhraPradesh
-
హౌసింగ్ రుణాలను బ్యాంకర్లు త్వరగా అందించాలి
ABN , First Publish Date - 2022-06-08T05:20:53+05:30 IST
హౌసింగ్ బిల్లులకు సంబంధించి బ్యాంకు అధికారులు లబ్ధిదారులకు ఇబ్బందులు కలుగకుండా త్వరగా అందించాలని మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ రామమోహన్‌రెడ్డి సూచించారు.

జమ్మలమడుగు రూరల్, జూన్ 7: హౌసింగ్ బిల్లులకు సంబంధించి బ్యాంకు అధికారులు లబ్ధిదారులకు ఇబ్బందులు కలుగకుండా త్వరగా అందించాలని మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ రామమోహన్‌రెడ్డి సూచించారు. మంగళవారం జమ్మలమడుగు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ టిడ్కో, హౌసింగ్, జగనన్న కాలనీ, తదితర సంఘాల పుస్తకాల నిర్వహణ అంశాలపై చర్చించారు. టిడ్కో, హౌసింగ్‌కు సంబందించి రుణాలు త్వరగా మంజూరు చేయాలని కోరారు. జగనన్న కాలనీకి సంబంధించిన బ్యాంకులలో పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. అందుకు బ్యాంకు అధికారులు సానుకూలంగా స్పందించడం జరిగిందని మెప్మా డిస్ట్రిక్ మిషన్ కోఆర్డినేర్ గంగులయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిబ్బంది రసూలమ్మ, ఉషారాణి, శ్రీనివాసులు, ఆర్పీలు పాల్గొన్నారు.