ఉత్తర కుమార ప్రగల్భాలు మానుకోండి
ABN , First Publish Date - 2022-01-10T04:56:53+05:30 IST
దొంగ ఓట్లు, అధికార బలం, అరాచకాలతో కుప్పం మున్సిపాలిటీ గెలుపు ఒక గెలుపేనా? ఇలాంటి ఉత్తర కుమార ప్రగల్భాలు మానుకోక పోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పంచాయతీరాజ్‌శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి హితవు పలికారు.
బద్వేలు, జనవరి 9 : దొంగ ఓట్లు, అధికార బలం, అరాచకాలతో కుప్పం మున్సిపాలిటీ గెలుపు ఒక గెలుపేనా? ఇలాంటి ఉత్తర కుమార ప్రగల్భాలు మానుకోక పోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పంచాయతీరాజ్‌శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి హితవు పలికారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే విజయ మ్మ స్వగ్రామంలో పార్టీ శ్రేణులతో కలిసి విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార బలం, డబ్బు, పోలీసుల ప్రోద్భలంతో రామచంద్రారెడ్డి చేస్తున్న అరాచకాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని త్వరలో వైసీపీ నేతలను ప్రజలు తరిమికొడతారని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ, మండల అధ్యక్షులు గుర్రంపాటి వెంగళరెడ్డి, బసిరెడ్డి రవికుమార్‌రెడ్డి, మహబూబ్‌బాష, నరసింహనాయుడు కొలవళి వేణుగోపాల్, నాగభూషణం పాల్గొన్నారు.