-
-
Home » Andhra Pradesh » Kadapa » Attahasanga School Games Federation options
-
అట్టహాసంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన ఎంపికలు
ABN , First Publish Date - 2022-10-27T23:45:56+05:30 IST
స్కూల్ గేమ్స్ ఫెడరేషన(ఎస్‌జీఎఫ్) అండర్-14, అండ ర్-17 పీలేరు నియోజకవర్గ స్థాయి ఎం పికలను గురువారం పీలేరులో అట్టహా సంగా నిర్వహించారు.

పీలేరు, అక్టోబరు 27: స్కూల్ గేమ్స్ ఫెడరేషన(ఎస్‌జీఎఫ్) అండర్-14, అండ ర్-17 పీలేరు నియోజకవర్గ స్థాయి ఎం పికలను గురువారం పీలేరులో అట్టహా సంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో జరిగి న ఈ సెలక్షన్సలో వాలీబాల్, బాల్‌బ్యా డ్మింటన, బ్యాడ్మింటన, టెన్నికాయిట్, త్రోబా ల్, కబడ్డీ అంశాల్లో బాలబాలికల జట్లను వేర్వేరుగా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమం లో అన్నమయ్య జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన కార్యదర్శి రాము మాట్లాడుతూ ని యోజకవర్గ స్థాయిలో ఎంపికైన జట్లను త్వరలో జిల్లా స్థాయి పోటీలకు పంపుతామని, అక్కడ ఉత్తమ ప్రదర్శన కనబరిచిన జట్లను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారన్నా రు. సెలక్షన్సకు పీలేరు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన 750 మంది క్రీడాకారులతో క్రీడా మైదానంలో సంద డి నెలకొంది. కార్యక్రమంలో పీడీలు ఉషారాణి, రమేశ బాబు, నాగరాజ, నరేంద్ర, చం ద్రశేఖర్, సంపూర్ణ, కలికిరి ఎంఈవో రంగనాథరెడ్డి, పీఈటీలు రాణి, చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు.
ములకలచెరువులో: స్థానిక జడ్పీహైస్కూల్ లో గురువారం తంబళ్ళపల్లె నియోజకవర్గ స్ధాయి క్రీడాపోటీలు జరిగాయి. బాలురు, బాలికల విభాగం అండర్ -14, అండర్ - 17 ఖోఖో, బాల్ బ్యాడ్మింటన, షటీల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను తంబళ్ళప ల్లె నియోజకవర్గ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. క్రీడాపోటీలను ఎంపీపీ సాయిలీల, ఎంఈవో వెంక టరమణ, సర్పంచ రహమతబీ, హెచఎం క్రిష్ణారెడ్డిలు ప్రారంభించారు. ఈ కార్యక్ర మంలో మాజీ సర్పంచ రవీంద్రారెడ్డి, నియోజకవర్గ ఎస్‌జీఎఫ్ ఇనచార్జి తాజ్‌బాషా, పీడీ సరోజమ్మ తదితరులు పాల్గొన్నారు.