దళితులపై దౌర్జన్యాలు సహించేదిలేదు

ABN , First Publish Date - 2022-11-18T23:55:20+05:30 IST

వైసీపీ అధికారంలో వచ్చాక రాష్ట్రంలో దళితులపై దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని, ఇలాంటి వా టిని సహించబోమని రాజంపేట పార్లమెం ట్‌ టీడీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మూని వెం కటరమణ పేర్కొన్నారు.

దళితులపై దౌర్జన్యాలు సహించేదిలేదు
మాట్లాడుతున్న టీడీపీ పార్లమెంట్‌ ఎస్సీసెల్‌ నేత వెంకటరమణ

మదనపల్లె టౌన, నవంబరు 18: వైసీపీ అధికారంలో వచ్చాక రాష్ట్రంలో దళితులపై దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని, ఇలాంటి వా టిని సహించబోమని రాజంపేట పార్లమెం ట్‌ టీడీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మూని వెం కటరమణ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక దేవతానగర్‌లోని టీడీపీ పార్లమెంట్‌ కార్యాల యంలో నిర్వహించిన సమావేశంలో రమణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన నిధులకు గండికొట్టింద న్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న గ్రాంటులను కొల్లగొడుతూ దళితులకు అందుతున్న 27 స్కీములను నిలిపివేశారన్నారు. దీనికి నిరసనగా ఈనెల 24వ తేదిన తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ నుంచి అంబేడ్కర్‌ సర్కిల్‌ వరకు టీడీపీ ఆధ్వర్యంలో దళితులతో నిరసన ర్యాలీ చేస్తున్నామన్నారు. ఈ ర్యాలీకి టీడీపీ 4వ జోన పరిధిలోని చిత్తూరు, గూడూరు, నెల్లూరు, తిరుపతి, అన్న మయ్య, కడప జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో దళితులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ ఎస్సీ విభాగం నాయకులు విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-18T23:55:20+05:30 IST

Read more