అక్రమ బదిలీలు పారదర్శక పాలనలో భాగమా: యూటీఎఫ్‌

ABN , First Publish Date - 2022-12-16T00:02:13+05:30 IST

ఒక పక్క ఉపాధ్యాయ బదిలీలకు షెడ్యూలు విడుదల చేసి మరో పక్క ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా అక్రమ బదిలీలు నిర్వహించడం పారదర్శకత పాలనలో భాగమా అని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విజయకుమార్‌, మహే్‌షబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

అక్రమ బదిలీలు పారదర్శక పాలనలో భాగమా: యూటీఎఫ్‌

కడప (ఎడ్యుకేషన), డిసెంబరు 15 : ఒక పక్క ఉపాధ్యాయ బదిలీలకు షెడ్యూలు విడుదల చేసి మరో పక్క ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా అక్రమ బదిలీలు నిర్వహించడం పారదర్శకత పాలనలో భాగమా అని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విజయకుమార్‌, మహే్‌షబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం కడప నగరం యూటీఎఫ్‌ జిల్లా కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పాలన పారదర్శకతకు మారు పేరని పదే పదే ప్రకటిచుకునే రాష్ట్ర ప్రభుత్వం కొందరు ఉపాధ్యాయుల పైరవీలకు తలొగ్గి కౌన్సెలింగ్‌ విధానానికి తూట్లు పొడుస్తోందన్నారు. తమ అనుయాయులైన కొందరు ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉత్తర్వులతో దొడ్డిదారిన అక్రమ బదిలీలు నిర్వహించడం దుర్మార్గమన్నారు. బుధవారం విజయవాడలో జరిగిన జిల్లా విద్యాశాఖాధికారుల సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు అక్రమ బదిలీలకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను రహస్య సీల్డ్‌ కవరులో డీఈఓలకు అందజేయడం దారుణమన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఉపాధ్యాయ బదిలీల్లో కేటగిరి 1, 2 లోని కొన్ని స్థానాలను బ్లాక్‌ చేస్తామని ఇప్పటికే అధికారులు ప్రకటించారని, మిగిలిన ఖాళీలను సిఫారసు బదిలీల ద్వారా భర్తీ చేస్తే మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాఉలు అక్కడే ఉండిపోవాల్సి వస్తుందని తెలిపారు. తక్షణమే సిఫార్సు బదిలీలు రద్దు చేిసి తమ పారదర్శకత, చిత్తశుద్దిని నిరూపించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సిఫారసు బదిలీలను ఉపసంహరించకోకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ నాయకులు కిరణ్‌కుమార్‌, రమణ, శివశంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T00:02:16+05:30 IST