అన్నమయ్య జిల్లా..స్వరూపం
ABN , First Publish Date - 2022-04-04T05:26:38+05:30 IST
నూతనంగా ఏర్పాటైన అన్నమయ్య జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గతంలో ఉన్న రాజంపేట రెవెన్యూ డివిజన్ నుంచి సిద్దవటం, ఒంటిమిట్టలను కడప రెవెన్యూ డివిజన్‌లోకి కలిపింది.
మూడు రెవెన్యూ డివిజన్‌లు
30 మండలాలు
రాయచోటి, ఏప్రిల్ 3: నూతనంగా ఏర్పాటైన అన్నమయ్య జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గతంలో ఉన్న రాజంపేట రెవెన్యూ డివిజన్ నుంచి సిద్దవటం, ఒంటిమిట్టలను కడప రెవెన్యూ డివిజన్‌లోకి కలిపింది. దీంతో ప్రస్తుతం రాజంపేట డివిజన్‌లో కోడూరు, పెనగలూరు, చిట్వేలి, పుల్లంపేట, ఓబులవారిపల్లె, రాజంపేట, నందలూరు, వీరబల్లి, టి.సుండుపల్లె మండలాలు ఉన్నాయి. అదే విధంగా కొత్తగా ఏర్పాటైన రాయచోటి రెవెన్యూ డివిజన్‌లో రాయచోటి, సంబేపల్లె, చిన్నమండెం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, పీలేరు, గుర్రంకొండ, కలకడ, కె.విపల్లె మండలాలు ఉన్నాయి. మదనపల్లె రెవెన్యూ డివిజన్‌లో మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం, తంబళ్లపల్లె, ములకలచెరువు, పెద్దమండ్యం, కురబలకోట, పెద్దతిప్పసముద్రం, బి.కొత్తకోట, కలికిరి, వాల్మీకిపురం మండలాలు ఉన్నాయి.
అన్నమయ్య జిల్లా...
భౌగోళిక విస్తీర్ణం 7951 చదరపు కిలోమీటర్లు
రెవెన్యూ డివిజన్‌లు 3
అసెంబ్లీ నియోజకవర్గాలు 6
మండలాలు 30
మునిసిపాలిటీలు/ నగర పంచాయితీలు 3
మండల పరిషత్‌లు 30
గ్రామ పంచాయతీలు 462
రెవెన్యూ గ్రామాలు 463
మునిసిపల్ వార్డులు 68
పల్లెలు 5,673
2011 జనాభా లెక్కల ప్రకారం ఇళ్లు 4,19,572
గ్రామ సచివాలయాలు 419
వార్డు సచివాలయాలు 82
2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా
పురుషులు 8.53 లక్షలు
స్ర్తీలు 8.44 లక్షలు
ఎస్సీలు 2.30 లక్షలు
ఎస్టీలు 0.62 లక్షలు
మొత్తం 16.97 లక్షలు
అక్షరాస్యతా శాతం 64.53