చోరీకి యత్నించిన వృద్ధుడి అరెస్టు

ABN , First Publish Date - 2022-09-14T04:38:43+05:30 IST

ఇంట్లోకి దూరి చోరీకి యత్నించిన ఓ వృద్ధుడిని మంగళవారం అరెస్టు చేసినట్లు తాలూకా సీఐ సత్యనారాయణ చెప్పారు.

చోరీకి యత్నించిన వృద్ధుడి అరెస్టు

మదనపల్లె క్రైం, సెప్టెంబరు 13: ఇంట్లోకి దూరి చోరీకి యత్నించిన ఓ వృద్ధుడిని మంగళవారం అరెస్టు చేసినట్లు తాలూకా సీఐ సత్యనారాయణ చెప్పారు. ఆయన కథనం మేరకు.. మదనపల్లె మండలం దుబ్బిగానిపల్లె పంచాయతీ రెడ్డివారిపల్లెకు చెందిన శంకరప్ప(65) కూలిపనులు చేస్తుండేవాడు. మూడురోజుల కిందట గ్రామానికి చెందిన కృష్ణమ్మ ఇంట్లోకి దూరి చోరీకి యత్నించాడు.  ఆమె బిగ్గరగా కేకలు వేయ డంతో పక్కకు నెట్టేసి పరారయ్యాడు. దీంతో కృష్ణమ్మ కిందపడి గాయపడింది. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.


Read more