అమరజీవి అందరికీ ఆదర్శం
ABN , First Publish Date - 2022-12-15T23:57:48+05:30 IST
ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు అందరికీ ఆదర్శమని మదనపల్లె టీడీపీ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ పేర్కొన్నారు.
మదనపల్లె టౌన, డిసెంబరు 15: ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు అందరికీ ఆదర్శమని మదనపల్లె టీడీపీ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ పేర్కొన్నారు. గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో పొట్టిశ్రీరాములు వర్దంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు. అనంతరం రమేశ మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం సత్యం, అహింస, హరిజనోద్ధరణ కోసం పొట్టి శ్రీరాములు ఉద్యమమే నడిపారన్నారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీరాములు కు ఆంధ్రులు కృతజ్ఞులుగా వుండాలన్నారు. కాగా స్థానిక దేవతానగర్ లోని టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో తెలుగు యువత రాష్ట్ర అధ్య క్షుడు శ్రీరామ్‌చినబాబు ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరంచుకుని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చినబాబు మాట్లాడుతూ 58 రోజుల పాటు ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములును ఆదర్శంగా తీసుకుని ఆంధ్ర రాష్ట్రం వైసీపీ కబంద హస్తాల నుంచి కాపాడేందుకు ఉద్యమం చేస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు ఎస్ఏ మస్తాన, మోడెం సిద్దప్ప, ఆర్జే వెంకటేశ, దొరస్వామినాయుడు, పఠా నఖాదర్ఖాన, గుత్తికొండ త్యాగరాజు, భవానిప్రసాద్, మేకలరెడ్డిశేఖర్, కత్తి లక్ష్మన్న, నాగయ్య, నీలకంఠ తదితరులు పాల్గొన్నారు.
పీలేరులో: అమరజీవి పొట్టి శ్రీరాములు 70వ వర్ధంతిని పీలేరులోని ఆర్యవైశ్య సంఘం, వాసవీ క్లబ్ గ్రేటర్, వాసవీ కపుల్స్ సంయుక్తంగా గురువారం ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా పీలేరు సంత ప్రాంగణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఆయన చేసిన త్యాగాలను స్మరించు కున్నారు. కార్యక్రమంలో పామిడి చైతన్య, పామిడి జయచంద్ర, చెంగ య్య, రాచపల్లె శ్రీనివాసులు, అరవింద్, గణపతి, సురేశ, మురళీ, ప్రసాద్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.
కలికిరిలో: కలికిరిలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని గురువా రం టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక అమరనాథ రెడ్డి భవనలో పొట్టిశ్రీరాములు చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు నిజా ముద్దీన, రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షుడు వాసునూరి చంద్ర శేఖర్, జనార్ధన గౌడ్, సనావుల్లా, మున్వర్ ఆలీ, విజయకుమార్ రెడ్డి, వెంకటపతి, చిన్నరెడ్డెయ్య, రాంబాబు, మోహన, అల్లావుద్దీన, రమణ, చల్లయ్య, షఫీ, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు. మేడికుర్తి సచివాల యంలో రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సల హాదారు నాగార్జునరెడ్డి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీపీ నూర్జహాన, జడ్పీటీసీ పద్మజ, జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి, మదనపల్లె డీఎల్డీవో లక్ష్మీపతి, డీఎల్పీవో జయకు మారి, ఎంపీడీవో గంగయ్య అధికారులు పాల్గొన్నారు.
బి.కొత్తకోటలో: తెలుగువారి ఆత్మగౌరవం కోసం, ప్రత్యేక తెలుగు రాష్ట్రం కొరకు, ఆమరణ నిరాహారదిక్ష చేసిన అమరజీవి పొట్టి శ్రీరా ములు వర్ధంతిని బి.కొత్తకోటలోని భవిత కేంద్రంలో ఘనంగా నిర్వహిం చారు. అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో ఎంఈవో రెడ్డిశేఖర్, ఉపాధ్యాయు లు, విద్యార్థులు, స్థానిక నాయకులు ఎంఆర్సీ, భవిత కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.
ఘనంగా పొట్టి శ్రీరాములు, వల్లభాయ్ పటేల్ వర్ధంతి
వాల్మీకిపురం, డిసెంబరు 15: అమరజీవి పొట్టి శ్రీరాములు, ఉక్కు మనిషి సర్దార్ వల్లబాయ్ పటేల్‌ల వర్ధంతిని గురువారం వాల్మీకిపు రం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పీవీసీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇరువురి చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు ప్రభుచరణ్ మాట్లాడుతూ తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని 58రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. అలాగే నిజాం పాలకుల మెడలు వంచి హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తం చేయడంతో పాటు 530కి పైగా సంస్థానాలను దేశంలో విలీనం చేసిన ఉక్కు మనిషి, భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లబాయ్ పటేల్ అని కొనియాడారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఉమా అమరేశ్వరి, అధ్యాప కులు మురళీధర్‌రెడ్డి, భాస్కర్‌కుమార్, ఎజాజ్‌బాషా, ప్రసాద్, రవి, ప్రేమలత, విద్యార్థులు పాల్గొన్నారు.