ఎమ్మెల్సీ అనంతబాబు దిష్టి బొమ్మ దహనం

ABN , First Publish Date - 2022-12-16T22:57:29+05:30 IST

హత్య కేసు నింది తు డు ఎమ్మెల్సీ అనంత బా బును ఊరేగించడం దళి తులను కించపరచడ మే నని టీడీపీ దళిత నా య కులు విమర్శించారు.

ఎమ్మెల్సీ అనంతబాబు దిష్టి బొమ్మ దహనం
అనంతబాబు దిష్టిబొమ్మను దహనం చేస్తున్న టీడీపీ నాయకులు

రైల్వేకోడూరు, డిసెంబరు 16: హత్య కేసు నింది తు డు ఎమ్మెల్సీ అనంత బా బును ఊరేగించడం దళి తులను కించపరచడ మే నని టీడీపీ దళిత నా య కులు విమర్శించారు. పట్ట ణంలోని అంబేడ్కర్‌ విగ్ర హం వద్ద శుక్రవారం పీ. రమేష్‌బాబు, తేనేపల్లి చిన్నా ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హత్య కేసు నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబు ఏదో సాధించినట్లు ఊరే గింపుగా వెళ్లడం దళితులను కించపరచడమే అని తెలిపారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి ఏమాత్రం బాధగా లేదన్నారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు ఎర్రతోట సురేష్‌, దుద్యాల అనితదీప్తి, జయచంద్ర, గంగాధర్‌, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T22:57:33+05:30 IST